ఇండియా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం జీవితం ఆధారంగా ఒక వెబ్ సిరీస్‌ను రూపొందించనున్నట్టు ప్రముఖ  దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2019  సంవత్సరంలో  ప్రకటించారు. ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని కూడా అయన  అన్నారు . అయితే, ఈ సిరీస్ ప్రకటించిన తరవాత వేరే సినిమాలతో బిజీ అయిన రామ్ గోపాల్ వర్మ మళ్ళీ సిరీస్ పై దృష్ట్టి పెట్టలేదు . అయితే, ఇప్పుడు  తన డ్రీమ్ ప్రాజెక్ట్‌పై వర్మ ఒక సంచలన ప్రకటన చేసారు .. అదేంటంటే  దావూద్ ఇబ్రహీం జీవిత కథను వెబ్ సిరీస్ ద్వారా తెరపై  చూపించబోతున్నట్టు  బుధవారం వర్మ ప్రకటించారు  ...అలాగే  ఈ సిరీస్ కు  సంబందించిన ఫస్ట్ లుక్ ని కూడా ఇదే నెల 15న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్టు అయన తెలిపారు ..  . ఇక రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించబోయే ఈ సిరీస్ ని  స్పార్క్ కంపెనీ అధినేత స్పార్క్ సాగర్ నిర్మిస్తున్నట్టు పేర్కొన్నారు. అయితే వర్మ గతం లో దావూద్ ఇబ్రహీం పై కంపెనీ అనే చిత్రం తీశారు .. కంపెనీ  సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికీ తెలుసు .. దావూద్ ఇబ్రహీం జీవిత కథ పట్ల ఎంతో ఆసక్తితో ఉన్న వర్మ కంపెనీ సినిమా తీసిన కూడా దావూద్ పై  మరో సినిమా తీయాలనే అప్పుడే అనుకున్నారట .. ఆలా 2019 లో సిరీస్ తీద్దామని ప్లాన్ చేయగా అప్పుడు  కుదరలేదు .. కానీ ఇప్పుడు వర్మ కొంచం టైం తీసుకోని దావూద్ జీవితాన్ని ఎలాగైనా  తెర పైకి తీసుకురావాలని ఫిక్స్ అయ్యారు ..  దీంతో వర్మ వెబ్ సిరీస్ తీస్తే బాగుంటుందని ఈరోజు ప్రకటన చేసారు .. వాస్తవ సంఘటనల ఆధారం చేసుకొని వాటితోనే సినిమాల తీయగల సమర్థుడు రామ్ గోపాల్ వర్మ  అందులో భాగంగా త్వరలో తెరకెక్కించబోయే దావూద్ ఇబ్రహీం సిరీస్  ప్రేక్షకులని అలరించాలని ఆశిద్దాం ..

మరింత సమాచారం తెలుసుకోండి: