ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయిన యూట్యూబ్ పాపులర్ స్టార్ వైవా హర్ష  అంటే తెలియని వారెవ్వరూ ఉండరు. వైవా హర్ష అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఫన్నీ అండ్ కామెడీ స్కిట్ లు చేస్తూ ప్రేక్షకాదరణ పొందాడు. తన విభిన్న ప్రతిభతో హాస్యనటునిగా వరుస సినిమాలతో బిజీ స్టార్ అయ్యాడు  తాజాగా హర్ష నటించిన "కృష్ణ అండ్ హిజ్ లీల", 'కలర్ ఫోటో' వంటి వెబ్ సినిమాలు నటుడిగా మంచి గుర్తింపునిచ్చాయి.
 
ప్రస్తుతం అల్లు అరవింద్ ఆహ యాప్ లో తమాషా విత్ హర్ష అనే షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు, వాటితో పాటు ఆహా నిర్మిస్తున్న చాలా వెబ్ సినిమాల్లో కూడా వైవా హర్ష నటిస్తున్నారు .ఇటీవల వైవా హర్ష నటించిన కలర్ ఫోటో మూవీ ఎంత విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చిత్రంలో బాల ఏసుగా తన నటనతో అందరి మనసు దోచుకున్న వైవా హర్ష ప్రస్తుతం మెగా డాటర్ సుస్మిత నిర్మిస్తున్న ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాడు.
 

అయితే తాజాగా హర్షకు అక్షర అనే అమ్మాయి తో నిచ్చతార్ధం జరిగింది. ఆ ఫొటోస్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. హర్ష తన సోషల్ మీడియాలో బ్యాచిలర్ గా ఇదే నా లాస్ట్ సెల్ఫీ అంటూ పోస్ట్ పెట్టాడు. ఈ నిశ్చితార్ధా వేడుకకి  హర్ష బంధుమిత్రులు స్నేహితులు, అలాగే మెగా ఫ్యామిలీ నుంచి సాయి ధరమ్‌ తేజ్‌, వేష్ణవ్‌ తేజ్‌, సుష్మితా కొణిదెల సినీ సెలబ్రిటీలు సైతం హాజరయి కాబోయే జంటను ఆశీర్వదించారు. హర్ష తన లవ్‌ స్టోరీని మీడియా  ముందు వెల్లడించాడు.  

అక్షర తనకు నాలుగేళ్లుగా పరిచయమని, స్నేహంగా ఏర్పడిన  పరిచయం ప్రేమగా మారిందని  నా ప్రేమ విషయం చెప్పగానే మా పేరెంట్స్‌ సత్యనారాయణ రావు, రామదేవి త్వరగా ఒప్పుకున్నారు. కానీ అక్షర తండ్రి గౌరీ శంకర్ కొంత సమయం తీసుకుని తర్వాత పెళ్లికి అంగీకరించాడు.  జూన్‌, జూలైలో వివాహం ఉండనున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం వైవా హర్ష, అక్షరల నిశ్చితార్థం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనితో వైవా హర్షకి అభిమానులు, సినీ తారలు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: