సంక్రాంతి రేసులో అందరికంటే ముందుగా అడుగుపెట్టిన ‘క్రాక్’ మూవీకి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఆ మూవీ కలక్షన్స్ స్టడీగా కొనసాగుతున్నాయి. నిన్న విడుదలైన విజయ్ ‘మాష్టర్’ కు ఏవరేజ్ టాక్ రావడంతో ఈరోజు విడుదల అయిన ‘రెడ్’ ‘అల్లుడు అదుర్స్’ ఫైనల్ టాక్ ను బట్టి ఈసంవత్సరం సంక్రాంతి విజేత ఎవరు అన్నది నిర్థారణ అవుతుంది.


ఇలాంటి పరిస్థితులలో ‘క్రాక్’ మూవీకి అన్యాయం జరుగుతోంది అంటూ నైజాం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి. నైజాం ఎరియాక్ సంబంధించి దిల్ రాజ్ ‘మాస్టర్’ ‘అల్లుడు అదుర్స్’ ‘రెడ్’ మూవీలను విడుదల చేస్తున్న పరిస్థితులలో ఆసినిమాల కోసం ‘క్రాక్’ మూవీ కలక్షన్స్ బాగున్నప్పటికీ నైజాం ఏరియాలో 80 ధియేటర్లలో తీసివేసి క్రాక్ కు అన్యాయం చేసారు అంటూ వరంగల్ శ్రీనివాస్ అభిప్రాయపడుతున్నాడు.


ఇప్పుడు శ్రీను చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో పెను సంచలనాలు సృష్టిస్తున్నాయి. ఇండస్ట్రీని ప్రభావితం చేస్తున్న ఆ నలుగురులో కీలక వ్యక్తిగా దిల్ రాజ్ కొనసాగుతున్నాడు అన్న విషయం ఓపెన్ సీక్రెట్ అయినప్పటికీ మళ్ళీ దిల్ రాజ్ గురించి వరంగల్ శ్రీను చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో ఈ సంక్రాంతి సమయంలో హాట్ హాట్ చర్చలకు దారితీస్తున్నాయి.


సంక్రాంతి సీజన్ లో ధియేటర్ల కబ్జా పరిపాటి అయినప్పటికీ సంక్రాంతి సీజన్ ను నమ్ముకుని ఏకంగా 4 సినిమాలు 50% ఆక్యుపెన్సీని కూడ లెక్కచేయకుండా ఒకదాని పై ఒకటి ఇలా పోటీగా విడుదల అవ్వడం నిర్మాతల మితిమీరిన ఆత్మ విశ్వాసాన్ని సూచిస్తోంది. ఇలాంటి పరిస్థితులలో ‘క్రాక్ సినిమాకు ధియేటర్ల విషయంలో అన్యాయం జరిగింది అంటూ వస్తున్న ఈ ఆరోపణలు ఎంతవరకు సమంజసం అంటూ ఇండస్ట్రీలోని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. సినిమా బిజినెస్ జాడం కంటే భయంకరమైనది అన్న విషయం తెలిసినా సినిమా మీద విపరీతమైన మోజుతో ఇండస్ట్రీలోకి వస్తున్న అనేకమంది నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్లకు ఇండస్ట్రీలో సరైన గాడ్ ఫాదర్ లేకపోవడంతో ఇలాంటి సమస్యలు వస్తున్నాయి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి: