ఒక్క చాన్స్ అంటూ ఒక పాత సినిమాలో నటి సంగీత ఒక పాత్రలో అంటుంది. అలాగే ఒక్క ఒక్క చాన్స్ విలువ ఎంతో ఉంటుంది. అలా ఒక్క సినిమాతో ఇపుడున్న టైం లో కరోనా  తో వేయి స్లంపులను ఎదురొంటున్న తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి కోటి కాంతులతో కొత్త దారి చూపించిన ఘనత మాత్రం  ఆ  డైరెక్టర్ కి దక్కుతుంది.

ఆయనే గోపిచంద్ మలినేని. మాస్ మహారాజా రవితేజాకు క్రాక్ తో హ్యాట్రిక్ విక్టరీని అందించిన ఘనత కచ్చితంగా గోపీదే. గోపీ బ్యాక్ టూ బ్యాక్ మూడు సినిమాలు రవితేజాతో తీసి హిట్లు ఇచ్చాడు. అలా తన మీద రవితేజా పెట్టిన నమ్మకం ప్రూవ్ చేసుకున్నాడు. ఇక క్రాక్ మూవీని అదరహో అన్నట్లుగా తీసిన క్రెడిట్ మాత్రం గోపీచంద్ దే.

సినిమా స్క్రీన్ ప్లే చాలా పకడ్బంధీగా డిజైన్ చేయడమే కాడు, ఎక్కడా పట్టు సడలకుండా చివరి సీన్ వరకూ సినిమాను నడిపించాడు గోపీ. ఇక ఈ సినిమా కధ పాతదే అయినా దాన్ని తనదైన స్టైల్ లో చెప్పడం ద్వారానే ఆడియన్స్ ని హాల్ లో కూర్చోబెట్టగలిగాడు అని చెప్పాలి. ఎక్కడా సీరియస్ నెస్ తగ్గకుండా సినిమాను కొనసాగించడంతో పాటు, యాక్షన్ ఎపిసోడ్స్ కూడా సూపర్ అన్నట్లుగా చిత్రీకరించిన ఘనత గోపీదే. ఇక రవితేజా కూడా ఒక హిట్ కోసం ఎంతో కాలంగా చూస్తున్నాడు. అలాంటిది సరైన హిట్ అతని ఖాతాలో పడింది.

ఇదిలా ఉంటే గోపీచంద్ మలినేనికి ఆఫర్లు వెల్లువలా వస్తున్నాయట. ఈ మూవీని చూసిన మెగా పవర్ స్టార్ రాం చరణ్ నుంచి కూడా గోపీచంద్ కి ఒక బంపర్ ఆఫర్ వెళ్లిందని అంటున్నారు. అదే విధంగా ఈ మూవీని చూసిన  ఒక భారీ ఫిల్మ్ మేకర్ బాలయ్య గోపీచంద్ కాంబోలో సినిమా చేయాలనుకుంటున్నట్లుగా టాక్ నడుస్తోంది. మరి కొందరు టాలీవుడ్ స్టార్స్ కూడా గోపీ కి ఓపెన్ ఆఫర్స్లు ఇస్తున్నారుట. మరి చూడాలి ఈ దెబ్బకు గోపీ రేంజి ఎక్కడికి వెళ్తుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: