టాలీవుడ్ లో విక్టరీ వెంకటేష్ కి మంచి ఫాలోయింగ్ ఉంది.. ఫ్యామిలీ ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడే అయన సినిమాలు ఇటీవలే బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడట్లేదు.. కథల ఎంపిక లో లోపాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. తన వయస్సు కి తగ్గ పాత్రలున్న సినిమాలే ఎంచుకుంటున్నా ఎందుకో ఆ సినిమాలు పెద్దగా ఆడట్లేదు.. రొటీన్ పాత్రలు చేస్తూ వెంకీ బోర్ కొట్టిస్తున్నాడని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. గత పదేళ్ల కాలంలో ఆయనకు f2 తప్పా కమర్షియల్ హిట్ ఏదీ లేదంటే ఆశ్చర్యపోవచ్చు..

ఇక తాజాగా అయన నారప్ప అనే క్లాసికల్ సినిమా ను చేస్తున్నారు. తమిళ్లో ధనుష్ నటించిన అసురన్ సినిమా కి ఇది రీమేక్ కాగా ఈ సినిమా పై వెంకీ ఫ్యాన్స్ మంచి ఆశలే పెట్టుకున్నారు. ఈ సినిమా తో పాటు f3 సినిమాలోనూ నటిస్తున్నాడు.. సూపర్ హిట్ అయిన f2 సినిమా కి ఇది సీక్వెల్ కాగా ఈ సినిమా పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇకపోతే వెంకటేష్ తన సినిమా ల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటాడో తెలిసిందే.. అలాంటిది ఓ సూపర్ హిట్ సినిమా ని చేజేతులా మిస్ చేసుకున్నాడట..

క్రాక్ సినిమా ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది.. అయితే దర్శకుడు గోపిచంద్ మలిలేని ముందు క్రాక్ కథ చెప్పింది వెంకటేష్ కే నట. కానీ లైన్ రొటీన్ గా అనిపించడంతో పాటు ఇంకేవో కారణాల వల్ల వెంకీ నో చెప్పాకే రవితేజ దగ్గరకు వెళ్లిందని సదరు వార్తల సారాంశం. ఏదేమైనా రీమేక్ సినిమాను నమ్ముకుని వెంకటేష్ క్రాక్ సినిమాను వదిలేయడం అయన చేసిన పొరపాటే.. క్రాక్ పుణ్యమాని గోపిచంద్ మలినేని మళ్ళీ ట్రాక్ లో పడ్డాడు. సాయి తేజ్ తో తీసిన విన్నర్ డిజాస్టర్ తర్వాత నాలుగేళ్లకు పైగా గ్యాప్ తీసుకున్న గోపిచంద్ సరైన టైంలోనే హిట్టు కొట్టాడు. దీని వల్లే ఇప్పుడు బాలకృష్ణ ప్రాజెక్ట్ గురించి టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: