అందుకే అంటారు. అన్ని అనుకూలతలూ ఉన్నా కూడా ఆవ గింజంత అదృష్టం కూడా కలసిరావాలని. అది లేకనే ఎంతో మంది జాతకాలు అలా తల్లకిందులు అయిపోయాయి. స్టార్స్ అంటారు సినీజీవులను. కానీ వారికి కూడా స్టార్ కలసి రావాలి. అపుడే వారు సూపర్ స్టార్లు అయ్యేది. రంగుల లోకంగా ఉండే సినీ రంగంలో నెగ్గుకుని వచ్చే వారు చాలా తక్కువ మందే అని చెప్పకతప్పదు.

ఇదిలా ఉంటే ప్రగ్యా జైస్వాల్ కంచె మూవీతో తెలుగు సినిమా రంగానికి పరిచయం అయింది. అందులో ఆమె చేసిన పాత్ర కానీ, అందులో ఒదిగిపోయిన తీరు కానీ ప్రగ్యాను ఎక్కడికో తీసుకెళ్తాయన్ని అంతా అంచనాలు వేశారు. ప్రగ్యా లో గొప్ప విషయం ఏంటి అంటే ఇటు ట్రెడిషనల్ లుక్ లోనూ అటు అవుట్ అండ్ అవుట్ బోల్డ్ లుక్ లోనూ కూడా సెట్ అయ్యే రూపం. ఇక అభినయం లోనూ ఆమె తన టాలెంట్ ని ఎపుడో నిరూపించుకున్నారు.

అయినా కూడా ప్రగ్యాకు చాన్సులు రాలేదు. వచ్చినవి కూడా కలసిరాలేదు. ఆమె దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు డైరెక్షన్ లో చేసిన ఓం నమో వెంకటేశాయ మూవీలో నాగార్జున తో ఆడిపాడింది. కానీ ఆ మూవీ పెద్దగా ఆడలేదు. ఇక ఆ తరువాత క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ణ వంశీతో చేసిన నక్షత్రం మూవీ కూడా ఫ్లాప్ అయింది. ఆ మీదట చేసిన ఒకటి రెండు సినిమాలు ఆమెకు ఏ విధంగా హెల్ప్ చేయలేకపోయాయి.

దాంతో చాలా రోజుల తరువాత వచ్చిన ఆఫర్ గా  ఇపుడు ప్రగ్యా చేతిలో ఒకే ఒక్క సినిమా ఉంది. అదే బాలయ్య, బోయపాటి హ్యాట్రిక్ కాంబో మూవీ. ఈ సినిమాలో ప్రగ్యాకు నటనకు కొంత స్కోప్ ఉండే పాత్ర అంటున్నారు. అలాగే గ్లామర్ కి కూడా చాన్స్ ఉందిట. మరి బాలయ్య బోయపాటి మూవీ అంటే కచ్చితంగా హిట్ అన్న ముద్ర ఉంది. దాంతో ప్రగ్యాకు ఈ మూవీతో హిట్ ఒకటి పడడం ఖాయం. ఆ మీదట అయినా ప్రగ్యా టాలీవుడ్ లో ఫ్రంట్ లైన్ రేసులోకి వస్తుందా అన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: