ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఆచార్య పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా చాలా లేట్ అయింది. ఇప్పటికే ఈ సినిమా కోసం కొరటాల శివ రెండేళ్లుగా ఎదురు చూస్తున్నాడు. అంతకంతకూ లేట్ అవుతున్న కారణంగా చిరంజీవి కొరటాల శివ మధ్య విభేదాలు కూడా మొదలయ్యాయని ప్రచారం కూడా జరిగింది. అయితే ఆ విషయాలు ఎలా ఉన్నా సరే ఇప్పుడు మరలా వీరిద్దరి మధ్య గ్యాప్ పెరుగుతున్నట్లు చెబుతున్నారు. 

ఎందుకంటే కొరటాల శివ సినిమాలు ఒకరకమైన సందేశాత్మక ధోరణిలో సాగిపోతుంటాయి. ఆయన పాత సినిమాలు శ్రీమంతుడు, జనతాగ్యారేజ్, భరత్ అనే నేను ఈ సినిమాలలో ఒక రకమైన సీరియస్ నెస్ తప్ప పెద్ద కామెడీకి చోటు ఉండదు. కానీ చిరంజీవి విషయానికి వస్తే ఆయన మాస్ మసాలా సినిమా చేసినా లేదా ఇంకా ఎలాంటి సినిమా చేసినా కామెడీ ఉండేలా చూసుకుంటాడు. ఇప్పుడు ఈ సినిమా విషయంలో కూడా కామెడీ చొప్పించాలని మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ మీద ప్రెజర్ పెడుతున్నట్లు సమాచారం. 

అయితే అనవసరమైన కామెడీ పెడితే సినిమా దెబ్బతింటుందని యోచనలో ఉన్నాడట కొరటాల శివ. ఆ మధ్య కాలంలో కామెడీ ట్రాక్ కోసం ఇతర రచయితలు కూడా చిరంజీవి సంప్రదించారనే వార్తలు టాలీవుడ్ వర్గాల్లో జోరుగా వినిపించాయి. ఆ తర్వాత ప్రచారం కొన్నాళ్ల పాటు ఆగిపోయింది. కానీ తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు బి.వి.ఎస్.రవి ఈ సినిమా కోసం కామెడీ ట్రాక్ సృష్టించే పనిలో ఉన్నాడని అంటున్నారు. ఈయన కామెడీ గనుక మెగాస్టార్ కి నచ్చితే ఆ కామెడీ ట్రాక్ ని కథలోకి చొప్పించే అవకాశం ఉంది. లేదంటే ఈ కామెడీ ట్రాక్ కోసం మరో రచయితని రంగంలోకి దిగడానికి చిరంజీవి సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: