పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో పెద్దగా పరిచయం అవసరం లేని వ్యక్తి. పవన్ కళ్యాణ్ అటు సినిమాలలోనూ,ఇటు వ్యాపారపరంగా బాగానే  రాణిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఎక్కువగా రీమేక్ సినిమాలలో నటించినప్పటికీ, కొన్ని సినిమాలు భారీ బ్లాక్ బస్టర్ గా పవన్ కళ్యాణ్ కెరియర్ నే మార్చేశాయి. పవన్ కళ్యాణ్ జీవితంలో బ్లాక్ బస్టర్  సినిమాలు ఎన్ని  ఉన్నాయో? అలాగే అట్టర్ ఫ్లాప్ సినిమాలు కూడా అన్నే  ఉన్నాయి. అయితే ప్రతిసారీ ఏదో ఒక సరికొత్త  పాత్రతో ప్రేక్షకుల ముందుకు రావాలని, ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాడు. అలా తీసిన కొన్ని సినిమాలు అనుకోకుండా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయాయి. ఆ సినిమాలేంటో? అలా ఆగిపోవడానికి గల కారణాలు ఏమిటో? ఇప్పుడు చూద్దాం.

సత్యాగ్రహి:
దేశభక్తి కాన్సెప్టుతో పవన్ కళ్యాణ్ తెరకెక్కించాలని అనుకున్న సినిమా సత్యాగ్రహి. ఈ సినిమాకు తానే స్వయంగా దర్శకత్వం వహించాలని అనుకున్నారు. కానీ అప్పటికే తన స్వీయ దర్శకత్వంలో వచ్చిన జానీ భారీ ఫ్లాప్ అవడంతో ఈ సినిమాను విరమించుకున్నారు. కానీ అప్పట్లో ఈ టైటిల్ కారణంగా ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్ వచ్చింది.ఈ టైటిల్ ఇంకా పవన్ పేరు మీద రిజిస్టర్ అయి ఉండడం గమనార్హం.

దేశి:
ఇక ఈ సినిమా కూడా దేశభక్తి కాన్సెప్ట్లో తీయాలనుకున్నాడు పవన్. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ అయింది. కానీ ఎందుకో  అనుకోని కారణం చేత ప్రాజెక్ట్ మూల పడిపోయింది.

ప్రిన్స్ ఆఫ్ పీస్:
సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో ఏసు క్రీస్తు చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా ప్రిన్స్ ఆఫ్ పీస్. అయితే ఈ సినిమాకు సంబంధించి 2010లో జెరూసలెంలో షెడ్యూలు కూడా  కంప్లీట్ అయింది.  ఈ సినిమా కూడా కొన్ని కారణాల చేత మధ్యలోనే ఆగిపోవాల్సి వచ్చింది.

కోబలి:
త్రివిక్రమ్, పవన్ కాంబినేషన్ లో సోషియో ఫాంటసీ మూవీగా కోబలి చిత్రాన్ని తెరకెక్కించాలని అనుకున్నారు. కానీ  ఈ సినిమా కూడా కొన్ని కారణాల చేత మధ్యలోనే ఆగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: