దర్శకుడు రాజమౌళి సినిమాలు అనగానే ఎంత రేంజ్ లో ఉంటాయో మనం ఊహించుకోకుండానే చెప్పేయొచ్చు. మగధీర లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను మన ముందుకు తీసుకువచ్చి ఆయనేంటో నిరూపించుకున్నాడు.ప్రపంచవ్యాప్తంగా బాహుబలి సినిమా ద్వారా సంచలనం సృష్టించి, సినీ ఇండస్ట్రీలో ఎదురులేని దర్శకుడిగా తన స్థానాన్ని ఒక పొజిషన్లో నిలుపుకున్నాడు దర్శకుడు రాజమౌళి. ఇంతటి మహా గొప్ప డైరెక్టర్ తో సినిమా అంటే ఎవరైనా సరే కళ్ళు మూసుకుని డేట్స్ ఇచ్చేస్తారు. కానీ రాజమౌళి ఫలానా సినిమాలో ఫలానా పాత్ర మీరు చేయాలని, పిలిచి మరీ  ఆఫర్ ఇచ్చినా కూడా అప్పట్లో కొంతమంది నటులు ఆ  ఆఫర్ను రిజెక్ట్ చేశారట. ఆ నటులు  ఎవరు? ఎందుకు రిజెక్ట్ చేయాల్సి వచ్చిందో? ఇప్పుడు తెలుసుకుందాం.

సోనం కపూర్ - అవంతిక:
బాహుబలి సినిమాలో తమన్నా పోషించిన పాత్ర పేరు అవంతిక. ఈ పాత్ర కోసం మొదట రాజమౌళి సోనం కపూర్ ను కలిశారట. కానీ కొన్ని కారణాల చేత ఆమె రిజెక్ట్ చేయడం జరిగింది.

ప్రభాస్  - సింహాద్రి:
సినీ ఇండస్ట్రీ లోనే భారీ హిట్ ను సాధించిన సింహాద్రి సినిమా ఎన్టీఆర్ కు మంచి పేరు తీసుకువచ్చిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమాను మొదటగా ప్రభాస్ ని  హీరోగా రాజమౌళి అనుకున్నాడట. కానీ ఈ సినిమా కథ ప్రభాస్ కు నచ్చకపోవడంతో రిజెక్ట్ చేశాడట.

వివేక్ ఒబెరాయ్ -  భల్లాల దేవా:
బాహుబలి సినిమాలో పవర్ ఫుల్ క్యారెక్టర్ భల్లాలదేవ. ఈ పాత్రలో రానా నటించి, పాత్రకు ప్రాణం పోశాడు. అయితే ఈ పాత్ర కోసం ముందుగా రాజమౌళి వివేక్ ఒబెరాయ్  ను సంప్రదించినట్లు సమాచారం. కానీ ఒబేరాయ్ వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో ఈ సినిమాను వదులుకున్నాడట..

శ్రీదేవి  - శివగామి:
బాహుబలి సినిమాలో వన్ అఫ్ ద బెస్ట్ రోల్  శివగామి. అయితే ఈ పాత్ర కోసం మొదట శ్రీదేవిని సంప్రదిస్తే,ఆమె ఈ పాత్రకు చాలా ఎక్కువ రెమ్యూనరేషన్ అడిగింది.అందుకే ఈ పాత్రను రమ్యకృష్ణ చేయడానికి ఫైనల్ చేసుకున్నాడు రాజమౌళి.

మరింత సమాచారం తెలుసుకోండి: