పూరి జగన్నాథ్ అనగానే  తెలుగు ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. భారీ పవర్ ఫుల్  పంచులతో, హీరోలను సరికొత్తగా చూపించే స్టైల్లో పూరి జగన్నాథ్ కు ఎవరూ  సాటిరారనే చెప్పవచ్చు. అంతేకాకుండా తాను తీయబోయే సినిమాలో టైటిల్స్ కూడా అంతే విభిన్నంగా ఉంటాయి.అంతటి మహోన్నతంగా చిత్రాలకు  దర్శకత్వం వహిస్తున్న పూరీజగన్నాథ్ మొదట తను తీయబోయే సినిమాలకు ఒక టైటిల్ పెట్టి, అనుకోకుండా కొన్ని కారణాల చేత మరొక టైటిల్ ను  ఫిక్స్ చేయడం జరిగింది. అయితే ఏ కారణం చేత టైటిల్స్ పేరు మార్చాల్సి వచ్చిందో  ఇప్పుడు చూద్దాం.

మహేష్ బాబు కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ చిత్రం పోకిరి. అయితే ఈ చిత్రానికి మొదట పూరి జగన్నాథ్ " ఉత్తం సింగ్ "అనే టైటిల్ ను డిసైడ్ చేశారు. కానీ కొన్ని కారణాల చేత ఆ సినిమాను "పోకిరి "అని టైటిల్ మార్చడం జరిగింది.

జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన "ఆంధ్రావాలా' మాస్ ఎంటర్టైన్మెంట్ మూవీగా తెరకెక్కిన  విషయం అందరికీ తెలిసిందే.  అయితే ఈ సినిమాకు మొదట "కబ్జా "అనే టైటిల్ను నిర్ణయించారు.కానీ ఈ సినిమాను కూడా అనుకోని పరిస్థితులలో ఆంధ్రావాలా గా మార్చారు.

హీరో రవితేజ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన క్లాసిక్ లవ్ స్టోరీ "ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం". ఈ సినిమాకు కూడా మొదట" జీవితం "అనే టైటిల్ ను అనుకున్నారు.

పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్,పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం బద్రి.ఈ సినిమాలో తొలి హీరోయిన్లుగా పరిచయం అయ్యారు రేణుదేశాయ్ తో పాటు అమీషా పటేల్. మొదట ఈ సినిమానికి " చెలి" అనే పేరు పెట్టాలనుకున్నారు అట. కానీ ఈ పేరు మరీ క్లాస్ గా ఉందని స్నేహితులు చెప్పడంతో టైటిల్ మార్చి "బద్రి "గా పెట్టారు.

రామ్ చరణ్ కథానాయకుడిగా వెండితెరకు పరిచయమైన తొలి సినిమా "చిరుత ".అయితే ఈ సినిమాకు మొదట "కుర్రాడు" అనే టైటిల్ ను డిసైడ్ చేస్తున్నారు. "లో క్లాస్ ఏరియా" ఉపశీర్షిక.అయితే చిరంజీవి తనయుడు అనే అర్థం వచ్చేటట్టుగా "చిరుత" అనే పేరును ఫైనలైజ్ చేసినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: