ప్రదీప్ మాచిరాజు బుల్లితెరపై తనదైన శైలి యాంకరింగ్ తో స్టార్ స్టేటస్ ను పొందాడు. ఎన్నో టాక్ షోస్ తో ఆడియెన్స్ కు దగ్గరయ్యాడు.

వెండితెరపై కూడా కన్నేశాడు. ఇప్పటివరకు చిన్న చిన్న రోల్స్ కే పరిమితమైన ప్రదీప్ హీరోగా లక్ టెస్ట్ చేసుకోవడానికి సిద్ధమయ్యాడు.

అనుకున్నదే తడవుగా "30 రోజుల్లో ప్రేమించడం ఎలా" అనే సినిమాలో హీరోగా నటించాడు. కానీ, దురదృష్టవశాత్తు పాండెమిక్ వల్ల ఈ సినిమా రిలీజ్ ఆగిపోయింది. దీన్ని గతేడాది సమ్మర్లో విడుదల చేయాలని మొదట్లో భావించారు. కానీ, పరిస్థితులు అనుకూలించలేదు.

ఈలోగా ఈ సినిమాకు ఓటీటీ ప్లాట్ఫార్మ్స్ నుంచి టెంప్టింగ్ ఆఫర్స్ వచ్చాయి.  కానీ, థియేటర్ రిలీజ్ కే మేకర్స్ మొగ్గు చూపారు.

ఈ సినిమాను జనవరి 29వ తేదీన థియేటర్లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. మొత్తానికి, ఆ విధంగా ఈ సినిమా ప్రేక్షకులకు రీచవడానికి సిద్ధమవుతోంది.

ఈ సినిమాలోని "నీలి నీలి ఆకాశం" అనే పాట మాసివ్ హిట్ కొట్టింది. యూట్యూబ్ లో లక్షలాది వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో ప్రదీప్ అలాగే అమృతా అయ్యర్ ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాను మున్నా డైరెక్ట్ చేశాడు.

ఇదిలా ఉంటే, లాక్ డౌన్ సమయంలో ఈ సినిమాను ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో వీక్షించవచ్చని ఆడియెన్స్ కలలగన్నారు. మరోవైపు, ఎప్పటికప్పుడు యాంకర్ ప్రదీప్ థియేటర్ రిలీజ్ కోసమే ఎదురుచూసి ఓటీటీ ప్లాట్ఫార్మ్స్ కు ప్రయారిటీ ఇవ్వలేదని తెలుస్తోంది.

ఓటీటీ ప్రయారిటీ తెలిసినా కూడా థియేటర్స్ లో ఇంకా బెస్ట్ గా ఆడియెన్స్ కు రీచవవచ్చన్నది ప్రదీప్ ఆలోచన అని తెలుస్తోంది.

తమ అభిమాన యాంకర్ హీరోగా ఎలా నటించాడో తెలుసుకోవడానికి ఆడియెన్స్ ఇంతకాలం ఎదురుచూసారు. మొత్తానికి ఈ సినిమా థియేటర్లో విడుదలకు సిద్ధమైంది.

ఇక ఈ సినిమా ఫలితమనేది ప్రదీప్ కెరీర్ ను డిసైడ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా మంచి హిట్ కొడితే ప్రదీప్ మరిన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: