రామ్ పోతినేని తన కెరీర్లోనే మొదటి సారి డ్యూయల్ రోల్ లో నటించాడు. హీరోగా అలాగే విలన్ గా తనలోనున్న డబుల్ షేడ్స్ ను ప్రేక్షకులకు తెలియచేశాడు. రామ్ 'రెడ్' మూవీ గురించి అనౌన్స్ చేయగానే ఆడియెన్స్ కు ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెరిగాయి. రామ్ ద్విపాత్రాభినయం గురించి తెలియగానే ఆడియెన్స్ కాస్తంత సర్ప్రైజ్ కి గురయ్యారు కూడా. తమిళ్ మూవీ తెలుగు రీమేక్ కాబట్టి ఈ సినిమాలో తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులూ చేర్పులూ చేస్తారని ఆడియన్స్ భావించారు. ఈ విషయంలో మేకర్స్ ఆడియెన్స్ ఎక్స్పెక్టేషన్స్ ను రీచయ్యారు.

కానీ, ఈ సినిమా మిశ్రమ స్పందనను అందుకుంటోంది. రామ్ పోతినేని ఇందులో సివిల్ ఇంజినీర్ గా 'సిద్ధార్థ్' అనే పాత్రలో కనిపించాడు. అతని చేతిలో ఓ గొప్ప హౌసింగ్ ప్రాజెక్ట్ కూడా ఉంది. అలాగే గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది. త్వరలో ఆమెను పెళ్ళిచేసుకునే ఆలోచనలో ఉన్నాడు.

కట్ చేస్తే, అచ్చు గుద్దినట్టు సిద్ధార్థ్ లాగానే ఉండే ఓ వ్యక్తికి అని రకాల చెడు అలవాట్లు ఉన్నాయి. మాయమాటలతో అందరినీ బురిడీ కొట్టించగల మాయగాడు ఈ ఆదిత్య. బీచ్ లో జరిగిన ఓ సంఘటన ఒకేలా కనిపించే ఈ ఇద్దరినీ ఓ చోటకు చేరుస్తుంది. ఆ తరువాత 48 గంటల్లో జరిగిందేమిటి అన్న విషయాన్ని వెండితెరపై చూడాలి.

ఇక ఈ సినిమాలో కీలకపాత్ర పోషించిన నివేతా పేతురేజ్ తన పాత్ర గురించి మాట్లాడుతూ...చిత్రలహరి షూటింగ్ లో ఉన్నప్పుడే దర్శకుడు కిషోర్ తిరుమల గారు తనను అప్రోచ్ అయ్యారని, తమిళ్ మూవీ రీమేక్ అని చెప్పగానే వెంటనే ఒప్పేసుకున్నానని చెప్పుకొచ్చింది. తమిళ్ వెర్షన్ ను కూడా తాను చూడలేదని చెప్పుకొచ్చింది.

మొత్తానికి, 'రెడ్' అనేది థ్రిల్లర్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కింది. పేషన్స్ తో చూడగలిగితే 'పర్వాలేదు, బానే ఉంది' అనే ఫీల్ కలిగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: