సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన బుచ్చి బాబు డైరక్షన్ లో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా కన్నడ భామ కృతి శెట్టి నిర్మిస్తున్న సినిమా ఉప్పెన. ఇప్పటివరకు సినిమాలోని సాంగ్స్ తోనే అంచనాలు పెంచగా ఈ సినిమా టీజర్ సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసి సర్ ప్రైజ్ చేశారు. ఉప్పెన టీజర్ చూస్తే మనసుని కదిలించే ప్రేమ కథగా వస్తుందని తెలుస్తుంది. హీరో, హీరోయిన్ కొన్నాళ్లు ఒకరిని ఒకరు చూపులతోనే ప్రేమించుకుని ఆ తర్వాత ఎక్స్ ప్రెస్ చేసుకుంటారు. ఫైనల్ వీరి ప్రేమ కథకు ఎలాంటి ముగింపు పలికింది అన్నది సినిమా కథ.

సినిమాలో హీరోయిన్ తండ్రిగా విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. టీజర్ ను చూస్తే సినిమా తప్పకుండా ప్రేక్షకులని కదిలించడం ఖాయమనేలా ఉంది. వైష్ణవ్ తేజ్ తొలి సినిమాగా ఉప్పెన ఇప్పటికే సూపర్ బజ్ ఏర్పరచుకుంది. సినిమాలో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిల జోడీ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది. ఇక ఈ సినిమా క్లైమాక్స్ సాడ్ ఎండింగ్ ఉంటుందని అంటున్నారు. సినిమా చూసి బయటకు వచ్చే ఆడియెన్స్ సినిమాను కూడా తమ వెంట తీసుకెళ్తారని తెలుస్తుంది.

బుచ్చి బాబు ఈ సినిమాను బాగా డీల్ చేశారట. ఇక ఈ సినిమాలో మరో స్పెషల్ థింగ్ ఏంటంటే దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్. డిఎస్పి మ్యూజిక్ అంటేనే సినిమా సగం హిట్ అన్నట్టే లెక్క. ఉప్పెనకు ఆల్రెడీ సూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చాడు దేవి శ్రీ ప్రసాద్. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిల ప్రేమ కథ తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందని అంటున్నారు. త్వరలో రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా టీజర్ మాత్రం ఇంప్రెస్ చేసింది.          

మరింత సమాచారం తెలుసుకోండి: