మాస్ మహారాజా రవితేజా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్నాడు. 'క్రాక్' సినిమాతో టాలీవుడ్ కు మళ్ళీ కొత్త కళను తీసుకొచ్చాడు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీను గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా జనవరి 9న విడుదలైంది.

ఎలాగో ఈ సినిమాకు రెడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఫ్రీ పబ్లిసిటీ కూడా లభించింది. ఈ ఇన్సిడెంట్ ఈ సినిమాకు బాగా హైప్ ను క్రియేట్ చేయడానికి హెల్ప్ చేసిందని చెప్పుకోవాలి.

'క్రాక్' ఇచ్చిన కిక్ తో రవితేజా తన రెమ్యునరేషన్ పట్ల కేలిక్యుటివ్ గా ఉండటం స్టార్ట్ చేశాడని టాక్. ఈ నేపథ్యంలో ఎన్నో ఆఫర్స్ ను కూడా వదులుకున్నాడట. దర్శకుడు మారుతి ఆఫర్ ను కూడా పారితోషికం ఇష్యూస్ తో నో చెప్పాడని తెలుస్తోంది.

'క్రాక్' సినిమా థియేటర్స్ లో బాగానే పెర్ఫామ్ చేస్తోంది కాబట్టి, మంచి రెమ్యునరేషన్ ను డిమాండ్ చేసే ఆలోచనలో ఉన్నాడు. అందుకే, 'క్రాక్' రిలీజయ్యే వరకు వేరే ఏ కొత్త ప్రాజెక్ట్స్ కి కూడా రవితేజా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

ఇదిలా ఉంటే, రవితేజా తన మొదటి రెమ్యునరేషన్ ను నాగార్జున చేతుల మీదుగా అందుకున్నాడు. "నిన్నే పెళ్లాడతా" సినిమాకి  అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసినప్పుడు జరిగిన సంఘటనను రవితేజా గుర్తుచేసుకున్నాడు. తన తీపి జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు. ఎటువంటి ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా తన స్వయంకృషిని నమ్ముకున్న రవితేజా అగ్రహీరోగా ఓ వెలుగు వెలుగుతున్నాడు.  

ఇక 'క్రాక్'లో శృతి హాసన్ తో దాదాపు ఎనిమిదేళ్ల తరువాత జోడీ కట్టాడు. 2013లో విడుదలైన యాక్షన్ కామెడీ మూవీ "బలుపు"లో వీరిద్దరూ కలిసి నటించారు.  

ఇదిలా ఉంటే, రవితేజా ప్రస్తుతం "ఖిలాడీ" షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను రమేష్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు 50 శాతం పూర్తయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: