ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..సాధారణంగా ఒక సినిమా హిట్టయిన లేక ప్లాప్ అయినా ఆ ఎఫెక్ట్ ఎక్కువగా హీరోపైన లేక హీరోయిన్ పైన పడవచ్చు. ఇక హీరోయిన్స్ పై కూడా కొన్నిసార్లు తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ఇక కొందరికి ఐరెన్ లెగ్ ట్యాగ్ వస్తుంటుంది. ఒకప్పుడు అలంటి నెగిటివ్ టాగ్స్ ను దాటుకుంటూ వచ్చింది శృతి హాసన్. కమల్ హాసన్ కూతురైనప్పటికి ఈ హాట్ బ్యూటీ తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ సొంతం చేసుకుంది. అయితే ఆమెను ఇప్పుడు గోల్డెన్ లెగ్ అంటున్నారు.

తాజాగా మాస్ మహారాజా రవితేజ తో కలిసి నటించిన క్రాక్ సినిమా ఘన విజయం వలన మళ్ళీ గోల్డెన్ లెగ్ ముద్ర పడింది . ఒకసారి పాత రికార్డులపై ఒక లుక్కేస్తే.. పవన్కళ్యాణ్ తీన్ మార్, పులి, పంజా వంటి సినిమాలు డిజాస్టర్ కావడంతో ఆ తరువాత వచ్చిన గబ్బర్ సింగ్ మాత్రం బిగ్గెస్ట్ హిట్. అందులో శృతి హాసన్హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. . ఇక మహేష్ బాబు నేనొక్కడినే, ఆగడు వంటి ప్లాపుల తరువాత శ్రీమంతుడు రికార్డు హిట్ కొట్టింది.ఈ సినిమాలో సూపర్ స్టార్ తో శృతి హాసన్ మంచి పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మాస్రాజాక్రాక్ సినిమాతో హిట్ అందుకున్నాడు అంటే శృతి హాసన్ కూడా అందుకు ముఖ్య కారణమని అంటూ.. అభిమానులు కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి స్టార్ హీరోయిన్ సెంటిమెంట్ బాగానే వర్క్ చేస్తున్నట్లు అర్ధమవుతోంది.

మరి భవిష్యత్తులో ఆ లక్కు పవర్ స్టార్పవన్కళ్యాణ్ నటిస్తున్న "వకీల్ సాబ్" విషయంలో జరుగుతుందో లేదో చూడాలి. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి: