యువ హీరో నితిన్ లాస్ట్ ఇయర్ భీష్మ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం వెంకీ అట్లూరి డైరక్షన్ లో రంగ్ దే సినిమా చేస్తున్నాడు నితిన్. ఈ సినిమాలో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. అప్పుడెప్పుడో నితిన్ పెళ్లి చేసుకునే టైం లో ఓ టీజర్ తో విష్ చేసిన రంగ్ దే టీం ఆ తర్వాత పాటని రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా నుండి సంక్రాంతి సందర్భంగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. నితిన్, కీర్తి సురేష్ ఇద్దరి లుక్ అదిరిపోయింది.

నితిన్ తో కీర్తి సురేష్ మొదటిసారి జోడీ కడుతున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. రంగ్ దే సంక్రాంతి పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచింది. నితిన్, కీర్తి సురేష్ ల జోడీ రంగ్ దేకి స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటుందని అంటున్నారు. రంగ్ దే సినిమా తో నితిన్ తన హిట్ మేనియా కొనసాగించాలని చూస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తున్న రంగ్ దే సినిమా మార్చ్ 26న రిలీజ్ ప్లాన్ చేశారు.

ఇప్పటికే సంక్రాంతి సినిమాల హంగామా మొదలవగా ఫిబ్రవరి, మార్చ్ లలో కూడా వరుస సినిమాలు వస్తున్నాయి. ఇక సమ్మర్ లో మళ్లీ ప్రేక్షకులకు స్టార్ సినిమాల సందడి రానుంది. నితిన్ రంగ్ దే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరుగుతున్నట్టు తెలుస్తుంది. నితిన్, కీర్తి సురేష్ ల జోడీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: