టాలీవుడ్ లో మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఎవరు అంటే మహేశ్ బాబు అని ఎవరైనా చెబుతారు.తాన అందానికే సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో మహేశ్ బాబు ఒకరు. ఇతర హీరోలతో పోలిస్తే మహేశ్ చాలా యంగ్ గా కనిపిస్తూ ఉంటారు. నాలుగు పదుల వయసులో కూడా పాతికేళ్ళ కుర్రాడిలా కనిపించడం బహుశా మహేశ్ ఒక్కడికే సొంతం. ప్రతీ సారి కూడా తన కొత్త సినిమాలలో స్టన్నింగ్ అండ్ యంగ్ లుక్స్ తో అదరగొడుతూనే ఉంటారు.

మరి అలాగే తాను ఇప్పుడు చేస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ “సర్కారు వారి పాట”కు కూడా వింటేజ్ లుక్ ను ప్రిపేర్ చేస్తూ తన ఫాన్స్ కు మరింత కిక్కివ్వడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా కోసం పెంచిన హెయిర్ స్టైల్ గాని మహేశ్ మెకోవర్ గాని చూసిన వారికి ఆశ్చర్యం కలుగక మానదు. ఎందుకంటే గత సినిమాలతో పోలిస్తే ఈ సారి మరింత యంగ్ గా కనిపిస్తూ అలరిస్తున్నాడు. అమద్య ఓ యాడ్ షూటింగ్ కోసం మహేశ్ తో నిర్వహించిన ఫోటో షూట్ కు లో మహేశ్ లుక్స్ చూసి ఒక్క ఫ్యాన్స్ మాత్రమే కాదు టోటల్ ప్రజలంతా కూడా ఆశ్చర్య పోయేలా మహేశ్ ఆ ఫోటో లో కనిపించాడు. అయితే తాజాగా మహేశ్ నుండి మరికొన్నిలుక్స్ బయటకు వచ్చాయి.

ప్రస్తుతం సోషల్ మీడియాలో మహేష్ యొక్క న్యూ లుక్ ఫోటోస్ విపరీతంగా  వైరల్ అవుతున్నాయి.అయితే ఈ ఫోటో లో మహేశ్ లుక్స్ పాతికేళ్ళ కుర్రాళ్ళు కూడా కుల్లుకునేలా ఉన్నాయి. కూల్ అండ్ స్టైలిష్,స్టాన్నింగ్ లుక్స్ తో అదరగొడుతున్నాడు. అయితే ఈ లుక్ మరో   సరికొత్త యాడ్ కోసమని తెలుస్తుంది. ఇదిలా ఉండగా మహేశ్ ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో " సర్కారు వారి పాట " సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేశ్ ఊర మాస్ గా కనిపిస్తాడని సమాచారం. ఈ సినిమా తరువాత రాజమౌళి ,త్రివిక్రమ్ సినిమాలు లైన్లో ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: