నవ్వడం ఒక యోగం. నవ్వించడం ఒక భోగం. నవ్వలేకపోవడం ఒక రోగం అని చెప్పిన హాస్యబ్రహ్మ జంధ్యాల జయంతి నేడు ... తనదైన కామెడీ పంచులతో ఆద్యంతం  ప్రేక్షకులని నవ్వించడం లో జంధ్యాలకి మంచి మార్క్ ఉంది  .. విజయాలతో సంబంధం లేకుండా చేసిన ప్రతి సినిమాలో తనదైన కామెడీ ఉండేలా జంధ్యాల  ప్రత్యేక శ్రద్ద చూపేవారు  .. తెరపై అయన పండించే కామెడీ అంత ఇంత కాదు .. అయన కామెడీ హాయిగా కడుపుబ్బా నవ్వుకునేలా ఉంటుంది ..  
జంధ్యాల సినిమాలు తీస్తున్న కాలం కామెడీ తో ఆకట్టుకునేవారు .. అయన తెరకెక్కించే హాస్య సన్నివేశాలు  ఇప్పటికి వేరే దర్శకులెవరు తీయడం సాధ్యపడదు .. జంధ్యాల అంటే హాస్య చిత్రాలకు  పెట్టింది పేరు  హాస్యబ్రహ్మగా అయన చిరకాలం ప్రేక్షకులకి  గుర్తుండిపోతారు ..

ఇక ఆయన పూర్తి పేరు జంధ్యాల వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి. జంధ్యాల  పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించారు.... చిన్నప్పటి నుండి జంధ్యాల ఎక్కువగా   నాటకాలు రచించారు  ..  ఆలా రాస్తూనే సినిమా ప్రయత్నాలు చేయగా కే విశ్వనాధ్ దృష్టిలో పడ్డారు .. ఆలా విశ్వనాథ్  చొరవతో జంధ్యాల  తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు .. అయన  రచయతగా చేసిన  తొలి చిత్రం   సిరిసిరి మువ్వ   . తొలి  చిత్రంతోనే తనదైన పంచ్ డైలాగులతో, కామెడీ టైమింగుతో జంధ్యాల పలువురిని ఆకర్షించారు .. క్లాస్ , మాస్ అని తేడా లేకుండా అన్ని చిత్రాలకు జంధ్యాల మాటల రచయితగా పనిచేసారు .. అటు తర్వాత దర్శకుడిగా అవతారమెత్తిన  జంధ్యాల అనేక హాస్య చిత్రాలను ప్రేక్షకులకు అందించారు ..  ఇక జంధ్యాల చిత్రాల్లో నటుడు  సుత్తి  వీరభద్రరావు గురించి  ప్రత్యేకంగా చెప్పుకోవాలి .. ఇక  సుత్తి వేలు కూడా జంధ్యాల సినిమా ఉండేది కాదు  .. వీరిద్దరూ జంధ్యాల  దర్శకత్వం లో వచ్చిన నాలుగు స్తంభాలాట సినిమాలో కామెడీ పంచులతో అదరగొట్టారు .. ఈ సుత్తిజంట జంధ్యాల  చిత్రాల్లో తమ  కామెడీ టైమింగ్ తో ఓ వెలుగు వెలిగారు ..  వారితో పాటు బ్రహ్మానందాన్నికూడా  అహనా పెళ్లంట  చిత్రంతో స్టార్ కమెడియన్ ని చేసారు.. అంతేకాదు   బ్రహ్మానందం  కామెడీ స్టార్ గా ఎదగడంలో జంధ్యాల పాత్ర చాలా ప్రముఖంగా ఉంటుంది . బ్రహ్మానందంతో పాటు నటి శ్రీలక్ష్మిని  బాబు చిట్టి అనే ఒకే ఒక్క  డైలాగ్ తో పాపులర్ చేసిన ఘనత ఒక్క జంధ్యాల గారికే దక్కుతుంది .. ఇక రాజేంద్రప్రసాద్ మరియు చిరంజీవి లాంటి నటులను స్టార్స్ చేసిన డైరెక్టర్స్ లో జంధ్యాల పేరు కూడా వినబడుతుంది .. మరోవైపు జంధ్యాల దర్శకుడిగా కాకుండా నటుడిగా సైతం మెప్పించారు .అయన కే . విశ్వనాథ్  దర్శకత్వం వహించిన ఆపద్భాందవుడు లో అద్భుత నటన కనబరిచారు విమర్శకుల ప్రశంసలు పొందారు ..

జంధ్యాల  తెరకెక్కించే ఒక్కో చిత్రానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది  . అద్భుతమైన కామెడీ చిత్రాలని అందించిన జంధ్యాల  తెలుగు సినిమా చరిత్రలోనే మేటి దర్శకుడిగా కీర్తి గడించారు .. తెలుగు వారిని తన చిత్రాలతో నవ్వులు పూయించిన  జంధ్యాల  2001 జూన్ 19న  కన్నుమూశారు .. ఆయన మరణించినా తన చిత్రాల ద్వారా హాస్యప్రియులను ఇప్పటికి నవ్విస్తూనే  ఉంటారు ..



మరింత సమాచారం తెలుసుకోండి: