ఒక్క సినిమా చాలు స్టార్ మార్చేస్తుంది. సూపర్ హిట్ కొట్టిందా ఇక తిరుగులేదు. కానీ అదే మ్యాజిక్  రెండవసారి రిపీట్ చేయడం మాత్రం ఎంతటి వారికైనా కష్టమే. గతంలో అయితే రిలీజ్ అయ్యేదాకా కూడా  సినిమా మీద పెద్దగా అంచనాలు ఉండేవి కావు. ఇపుడు సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఫ్యాన్స్ ఒక రేంజిలో అంచనాలు పెట్టుకుంటున్నారు.

దానికి ప్రసార సాధనాలు టెక్నాలజీ కూడా తోడు అవుతోంది. దాంతో సినిమా తెర మీద ఊహించిన దానికి భిన్నంగా వస్తే మాత్రం దెబ్బకు ఎందరి జాతకాలో రివర్స్ గేర్ వేస్తాయి. ఇపుడు అదే పరిస్థితి మాస్టర్ డైరెక్టర్ లోకేష్ కనక రాజన్ ది అయింది అంటున్నారు. అతను ఖైదీ మూవీని తీసి మొత్తం ఇండియన్ సినిమా ఇండస్ట్రీనే షేక్ చేశాడు.

మంచి టాలెంట్ ఉంది అని అంతా నాడు  శభాష్ అన్నారు. దాంతో స్టార్ హీరోలు పోటీ పడి మరీ లోకేష్ తో మూవీస్ చేయడానికి రెడీ అయ్యారు. ఈ లోగా తమిళ్ స్టార్ విజయ్ మాస్టర్ మూవీ వచ్చింది. సంక్రాంతికి టార్గెట్ చేసి రిలీజ్ అయిన ఈ మూవీ రిజల్ట్ కాస్తా డిఫరెంట్ గా ఉండడంతో ఇపుడు లోకేష్  తో మూవీస్ చేయాలనుకున్న వారు వెనక్కు తగ్గుతారా అన్న కొత్త డౌట్లు వస్తున్నాయట.

ఇక మెగా పవర్ స్టార్ రాం చరణ్  అయితే ఆర్.ఆర్.ఆర్ తరువాత ఏప్రిల్ నుంచి కొత్త ప్రాజెక్ట్ టేకప్ చేస్తాడు అంటున్నారు. ఆయన చేసే మూవీ ఎవరి డైరెక్షన్ లో అన్నది ఒక ప్రశ్నగా ఉంది. రాం చరణ్ లిస్ట్ లో ప్యారిటీగా మాస్టర్ డైరెక్టర్ లోకేష్ పేరు కూడా ఉందిట. అయితే లోకేష్ మాస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకోకపోవడంతో ఇపుడు మెగా హీరో ఆలోచనలు ఏమైనా మారుతాయా అన్నది కూడా చర్చగా ఉందిట. ఒకవేళ దాన్ని సైతం పక్కన పెట్టి లోకేష్ కి మెగా హీరో చాన్స్ ఇస్తే మాత్రం లోకేష్ పంట పండినట్లే. చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: