కోలీవుడ్ యాక్ట్రస్ వరలక్షి శరత్ కుమార్ టాలీవుడ్ పై కూడా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. "తెనాలి రామకృష్ణ, బిఏ బి ఎల్" సినిమా ద్వారా ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ కు పరిచయమైంది. ఈ సినిమాలో మిలియనీర్ బిజినెస్ వుమన్ గా ఈ భామ నటించి ఆకట్టుకుంది. సందీప్ కిషన్ ఈ సినిమాలో హీరోగా నటించాడు. హన్సిక హీరోయిన్ గా నటించింది.

రీసెంట్ గా వరలక్షి శరత్ కుమార్ 'క్రాక్' మూవీలో "జయమ్మ" పాత్రలో అలరించింది. ఈ సినిమా సక్సెస్ మీట్ లో తన సంతోషాన్ని బయటపెట్టింది. తన పాత్రను ఇంతలా ఆదరిస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పుకొచ్చింది. ఇంత ప్రేమను తనపై కురిపించినందుకు సంతోషంగా ఉందని వెల్లడించింది. ఈ సినిమాలో తనకు పవర్ ఫుల్ పాత్రను ఇచ్చినందుకు ప్రొడ్యూసర్స్ కు కృతఙ్ఞతలు తెలుపుకుంది.

రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్ గురించి స్పెషల్ గా మెన్షన్ చేసింది. వారి ఫైట్స్ ను విజిల్ కొట్టి మరీ చూశానంటూ చెప్పుకొచ్చింది. థమన్ ఇచ్చిన ఆర్ ఆర్ కి గూస్ బంప్స్ వచ్చాయని ప్రత్యేకంగా చెప్పుకొచ్చిందీ కోలీవుడ్ భామ. డైరెక్టర్ గోపీచంద్ "జయమ్మ" అనే క్యారక్టర్ కు లైఫ్ ఇచ్చి ఆ పాత్రను తనకు ఆఫర్ చేశారని చెప్పుకొచ్చింది. ఈ అవకాశం ఇచ్చినందుకు థాంక్స్ చెప్పుకుంది.

ఇదే సక్సెస్ మీట్ లో డైరెక్టర్ గోపీచంద్ మలినేని తన సంతోషాన్ని పంచుకున్నాడు. థియేటర్ల వద్ద రవితేజా వల్ల మళ్ళీ జాతర మొదలైందని అన్నాడు. 'డాన్ శీను'ను డైరెక్ట్ చేసే అవకాశం రవితేజా ఇచ్చాడని గుర్తుచేసుకున్నాడు. ఆ తరువాత 'బలుపు' అలాగే 'క్రాక్'ను డైరెక్ట్ చేసే అవకాశం కూడా తనకు రవితేజా ఇచ్చాడని చెప్పుకొచ్చాడు.

'క్రాక్'తో తన కెరీర్ నే మలుపు తిప్పాడని సంబరపడ్డాడు గోపీచంద్ మలినేని. "జయమ్మ" క్యారక్టర్ లో వరలక్ష్మి జీవించిందని, నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారక్టర్ చనిపోతున్నప్పుడు ఆడియెన్స్ చాలా ఫీలయ్యారని, "జయమ్మ" క్యారక్టర్లో వరలక్ష్మి అంత బాగా నటించిందని మెచ్చుకున్నాడు.





మరింత సమాచారం తెలుసుకోండి: