దాదాపు మూడేళ్ళ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రీ ఎంట్రీ ఇస్తున్న చిత్రం “వకీల్ సాబ్”. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘పింక్’ సినియాకు ఇది రీమేక్. దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉణ్నాయి. ఈ చిత్రం నుంచి మోస్ట్ అవైటెడ్ టీజర్ మేకర్స్ నిన్ననే విడుదల చేశారు. దీనికి ఇప్పుడు భారీ రెస్పాన్స్ వస్తోంది.

అయితే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ టీజర్ చూసిన తర్వాత.. పవన్ ఫ్యాన్సే కాదు, ఒరిజినల్ చూసిన వాళ్లు కూడా షాకయ్యారు. ఎందుకంటే అసలు పింక్ అనేది ఓ వుమెన్ ఓరియెంటెడ్ ఎమోషనల్ డ్రామా. అలాంటి చిత్రంలో పవర్ స్టార్ నటిస్తుంటే ఆ రేంజ్ ఉంటుందా? అని డౌట్స్ ఉన్నాయి. అందుకే నిర్మాత దిల్ రాజు కూడా ఈ సినిమా కథలో పవన్ రేంజ్‌కు తగ్గట్టుగా చాలా మార్పులు చేర్పులు చేస్తున్నామని గతంలోనే ప్రకటించారు. ఈ మార్పులు ఎంతలా చేశారో టీజర్ చూస్తే తెలిసిపోతోంది.

మహిళా ప్రాధాన్యం ఉన్న కథకు పవర్ స్టార్ మ్యాజిక్ ను ఓ రేంజ్ లో యాడ్ చేసినట్టు టీజర్‌లో కనిపిస్తోంది. కచ్చితంగా ఈ క్రెడిట్ మొత్తం దర్శకుడు శ్రీరామ్ వేణుకే ఇవ్వాలి. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. పింక్ కథకు చాలానే మార్పులు చేశామని, తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా, అలాగే పవన్ ఇమేక్‌కు అనుగుణంగా మార్పులు చేశానని చెప్పారు. ఆ మార్పులు ఈ రేంజ్ లో ఉంటాయని పవన్ ఫ్యాన్స్ అస్సలు ఊహించలేదు. ముఖ్యంగా టీజర్ లో పవన్ యాటిట్యూడ్ ను ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేసేస్తున్నారు.

అలాగే సినిమాకు చేసిన మార్పుల్లో భాగంగా మొత్తం మూడు ఫైట్ సీక్వెన్స్ లు డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. అలాగే పవన్ ను కూడా మూడు రకాల వేరియేషన్స్ లో చూపించారు. ఇవన్నీ చూసిన ఫ్యాన్స్.. సినిమా చూస్తే కచ్చితంగా ఒరిజినల్ కన్నా డిఫరెంట్‌గా ఉంటుందని భావిస్తున్నారు. ఇవన్నీ చూస్తే “వకీల్ సాబ్” ను దర్శకుడు శ్రీరామ్ వేణు కొత్తగానే చూపించడం గ్యారంటీ అని సంబర పడిపోతున్నారు ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: