ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...సీనియర్ డైరెక్టర్  గుణశేఖర్ డైరెక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన  ఒక్కడు సినిమా  వచ్చి పెద్ద హిట్ అయ్యిందో చెప్పనవసరం లేదు. ఇప్పటికి  ఈ సినిమా వచ్చి  18 సంవత్సరాలు అయ్యింది. దీనిని గుర్తు చేసుకుంటూ ఒక్కడు పోస్టర్స్ ని షేర్ చేసింది చిత్రయూనిట్. 2003లో జనవరి 15వ తేదిన సంక్రాంతి పండక్కి ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఒక్కడు సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేసి పారేసింది. ప్రొడ్యూసర్ ఎమ్ ఎస్ రాజు ఎంతో ఖర్చుపెట్టి మరీ చార్మినార్ సెట్ వర్క్ ని వేసి ఈ సినిమాని నిర్మించారు. సినిమా మేకింగ్ లో ఎక్కడా తగ్గలేదు.అప్పటివరకూ మహేష్ బాబుకి మాస్ హిట్ అనేది లేదు. అయినా కూడా ఎంతో ధైర్యంగా ఈ సినిమాకి భారీగా ఖర్చుపెట్టారు.
నిర్మాత  నమ్మకాన్ని నిలబెడుతూ డైరెక్టర్ గుణశేఖర్ ఈసినిమాని అన్ని కమర్షియల్ హంగులతో తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్నాడు.

మెలోడీ బ్రహ్మ  మణిశర్మ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, పాటలు సూపర్ సక్సెస్ అయ్యాయి. భూమిక మహేష్ బాబుల మధ్యన కెమిస్ట్రీ, మహేష్ బాబు ప్రకాష్ రాజ్ ల యాక్షన్ సీన్స్ సినిమాకి హైలెట్ అయ్యాయి. ముఖ్యంగా కర్నూల్ కొండరెడ్డి బురుజు సెంటర్లో ఒబుల్ రెడ్డి అయి ప్రకాష్ రాజ్ ని ఒక్కటి పీకి మరీ హీరోయిన్ ని తీసుకెళ్లే సీన్ సూపర్బ్ గా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యింది.ఆ తర్వాత ఈ సినిమా ఎనిమిది నంది అవార్డులు, నాలుగు ఫిలిం ఫేర్ అవార్డ్స్ అందుకుని మహేష్ బాబు కెరియర్ లోనే ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. విడుదల అయిన మొదటి రోజునే ఈ సినిమాకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఎన్నో రికార్డ్స్ ని సైతం బ్రేక్ చేసింది ఈ సినిమా. ఈ సినిమాని తమిళం, బెంగాలీ, హిందీ , కన్నడ, ఒరియా భాషల్లో రీమేక్ కూడా చేశారంటే ఎంతటి ఘన విజయం  అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు.

కలక్షన్స్ పరంగా కూడా బాక్సీఫీస్ దగ్గర రికార్డ్స్ ని క్రియేట్ చేసింది ఈ సినిమా. సంక్రాంతి పండక్కి ఎలాంటి అంచనాలు లేకుండా సోలోగా వచ్చిన మహేష్ బాబు కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ ని ఒక్కడు సినిమాతో అందుకున్నాడు.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి: