సాధారణంగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది కమెడియన్స్ వస్తూ పోతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రమే తమ దైన మేనరిజంతో తెలుగు ప్రేక్షకులందరికీ ఎప్పుడు గుర్తుండిపోయే విధంగా కామెడీని పంచుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.  ఇలా తెలుగు సినిమాలు అన్నింటిలో తాగుబోతు పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా.. తనదైన మేనరిజంతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతగానో కామెడీని పండిస్తూ తెలుగు ప్రేక్షకుల ప్రేమాభిమానాలు సంపాదించుకున్నారు తాగుబోతు రమేష్. దాదాపు కొన్ని రోజుల పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో తన హవా నడిపించాడు అనే చెప్పాలి.


 ఇక ఇప్పటికి కూడా ఎన్నో సినిమాల్లో తనదైన కామెడీ టైమింగ్ తో అదరగొడుతు ప్రేక్షకులు అలరిస్తున్నాడు. అదేసమయంలో ఇటీవలే తెలుగు ప్రేక్షకులు  అందరిని ఎంతగానో అలరించి కడుపుబ్బా నవ్వించడానికి ఇటీవల జబర్దస్త్ కామెడీ షో లో టీం లీడర్ గా ఎంట్రీ ఇచ్చాడు అన్న విషయం తెలిసిందే. మొదట జబర్దస్త్ స్కిట్స్ చేసేందుకు కాస్త తడబడినప్పటికీ ఆ తర్వాత మాత్రం ఎంతగానో పుంజుకొని ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారు తాగుబోతు రమేష్.



 ఇక ప్రతీ వారం కూడా సరి కొత్త స్కిట్స్  తో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు.  అయితే ఇటీవలే వచ్చే వారానికి సంబంధించిన జబర్దస్త్ ఎపిసోడ్ ప్రోమో విడుదల చేసింది మల్లెమాల యాజమాన్యం. ప్రస్తుతం ఈ ప్రోమో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ ప్రోమో లో  భాగంగా చివరిలో తాగుబోతు రమేష్ స్కిట్ వస్తుంది. ఈ క్రమంలో నేను పుట్టి 30 సంవత్సరాలు నాలో ప్రేమ పుట్టి పది సంవత్సరాలు అంటూ డైలాగులు చెబుతుంటే ఇంకో మాట చెప్పు అంటూ జడ్జి రోజా పంచ్ వేస్తుంది. మొత్తం కలిపి 40 సంవత్సరాలు అంటూ తాగుబోతు రమేష్ చెప్పడంతో అది సరైన లెక్క రోజా అంటుంది. దీంతో అందరూ నవ్వుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: