సంక్రాంతి సీజన్ సినీ ఇండస్ట్రీ కి కాస్త ప్రత్యేకమనే చెప్పాలి. కరోనా కారణంగా దాదాపుగా ఏడాది కాలంగా సినిమా థియేటర్లు మూత పడ్డాయి. దీంతో సినీ రంగానికి భారీగా నష్టం వచ్చింది. ఏది ఏమైనప్పటికి మళ్ళీ ఈ ఏడాది సంక్రాంతికి సినిమాలతో థియేటర్స్ పూర్వ వైభవం తెచ్చుకుంటున్నాయి. అయితే ఈ ఏడాది మాత్రం సంక్రాంతి పండుగను మాస్ మహారాజ్ ఘనంగా ప్రారంభించదనే చెప్పాలి. ఎన్నో ఏళ్లుగా హిట్స్ లేక సతమతమౌతున్న మాస్ మహారాజ్ తాజాగా విడుదల అయిన " క్రాక్ " తో సూపర్ హిట్ సొంతం చేసుకున్నాడు.

నిజానికి తన సినిమాకు వచ్చిన భారీ రెస్పాన్స్ తోనే మిగతా సినిమాలకు కూడా బూస్టప్ ఇచ్చినట్టు అయ్యింది. " క్రాక్ " సినిమా విడుదల అయిన మొదటి రోజు నుండే సూపర్ హిట్ టాక్ తో భారీ వసూళ్లను రాబడుతుంది. అంతే కాకుండా ఈ సినిమాకు పోటీగా మరో మూడు సినిమాలు రేస్ లో ఉన్నప్పటికి మాస్ మహారాజ్ సినిమాకు స్ట్రాంగ్ వసూళ్లే వస్తున్నాయి. మరి నిన్న సంక్రాంతి పండుగ రోజు వసూళ్ల విషయానికి వస్తే నైజాం ఏరియాలో కూడా గట్టి వసూళ్లే అందుకుంది. 

నిన్న ఒక్కరోజే ఈ చిత్రం 58 లక్షలు వసూలు చేసి అదరగొట్టింది. కానీ భారీ అంచనాలతో విడుదలై క్రాక్ కన్నా ఎక్కువ లొకేషన్స్ ఉన్న “మాస్టర్” చిత్రంకు 43 లక్షలు మాత్రమే నైజాం నుంచి వసూళ్లు రాబట్టగలిగింది. అలాగే ఈ రెండు సినిమాలతో పాటుగా రామ్ పోతినేని "రెడ్ " ,బెల్లంకొండ శ్రీనివాస్ " అల్లుడు అదుర్స్ " సినిమాలు రేస్ లో ఉన్న వాటి కలెక్షన్లు నామమాత్రంగానే ఉన్నాయి. ఏదిఏమైనప్పటికి మాస్ మహారాజ్ ఈ సంక్రాంతి సీజన్ లో తన " క్రాక్ " చూపిస్తూ సంక్రాంతి విన్నర్ గా దూసుకుపోతున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: