ప్రతుత్తం ఇండియా వైడ్ గా భారీ అంచనాలు నెలకొన్న పర్ఫెక్ట్ పాన్ ఇండియా చిత్రం " కే‌జి‌ఎఫ్ చాప్టర్-2 " ఇండియా వైడ్ ఉన్న సినీ అభిమానులు ఈ సినిమా కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఇటీవల ఈ సినిమా హీరో యష్ పుట్టినరోజు సందర్బంగా చిత్రా యూనిట్ ఈ సినిమా టీజర్ ను విడుదల చేసింది. అయితే టీజర్ ముందే లీక్ కావడం వల్ల అనుకున్న సమయం కంటే ఒకరోజు ముందుగానే ఈ సినిమా టీజర్ ను హటాత్తుగా విడుదల చేశారు. 

అయినప్పటికి ఎవ్వరూ ఊహించని రీతిలో " కే‌జి‌ఎఫ్ చాప్టర్ 2 " టీజర్ భీభత్సమైన రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇండియన్ సినిమాలోనే కాకుండా వరల్డ్ వైడ్ గా కూడా ఈ టీజర్ పలు ఫాస్టెస్ట్ రికార్డులను నెలకొల్పింది. టీజర్ విడుదల అయ్యి ఇప్పటికీ వారం రోజులు కావొస్తున్న యూట్యూబ్ లో రికార్డ్ మాత్రం ఆడడం లేదు. ఇప్పటికే ఎన్నో మైల్ స్టోన్స్ ను అందుకుంటూ వస్తున్న ఈ టీజర్ లేటెస్ట్ గా 150 మిలియన్ సెన్సేషనల్ వ్యూస్ మైల్ స్టోన్ ను అందుకుంది. 

అంతే కాకుండా 7.5 మిలియన్ లైక్స్ ను కూడా టచ్ చేసి చరిత్ర సృష్టించింది. ప్రశాంత్ నీల్ దీనిపై ట్విటర్ వేదికగా స్పందిస్తూ " చాలా ఆనందంగా ఉంది ..అందరికీ కృతజ్ఞతలు " అంటూ ట్వీట్ చేశాడు.  దీన్ని బట్టి "కే‌జి‌ఎఫ్ చాప్టర్ 2 " కోసం దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఏ రేంజ్ లో ఎదురు చూస్తున్నారో ఈ టీజర్ చెప్పకనే చెప్పింది మరి ఇక ముందు నుంచి వచ్చే ట్రైలర్ సినిమాలకు ఏ స్థాయి రెస్పాన్స్ ఉంటుందో ఊహాతీతమే అని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: