మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి అనగానే హీరో అని అనే వారి కంటే కూడా మంచి నటుడు అనే వారే ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే.. విజయ్ సేతుపతి ముందు నుంచి కూడా హీరో పాత్రలే చేయాలని కాకుండా మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకునేందుకే ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. ఈ కారణంగానే విజయ్ సేతుపతి అంటే ఓ ప్రత్యేక ట్రెండ్ క్రియేట్ అయింది. తాజాగా ఆయన మాస్టర్ సినిమాలో విలన్‌గా నటించి విమర్శకుల నుంచి కూడా ప్రశంసలను అందుకున్నారు. ఇళయ దళపతి విజయ్ హీరోగా నటించిన ఈ సినిమాలో ఆయన కంటే కూడా ఎక్కువ మార్కులు విలన్‌గా నటించిన విజయ్ సేతుపతికే పడ్డాయని చెప్పాలి. అంతలా ఆయన ఈ సినిమాలో జీవించారు.

హీరో కంటే కూడా విలన్ మేనరిజమే బాగుందంటూ సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. ఇక మాస్టర్ సినిమా తరువాత విజయ్ సేతుపతికి తెలుగు ఇండస్ట్రీ నుంచి వరుస పెట్టి నెగిటివ్ ఆఫర్లు వస్తున్నట్టు సమాచారం. ఆయన ఇప్పటికే వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్‌లో నటిస్తున్నారు. ఇక అల్లు అర్జున్, సుకుమార్ చిత్రం పుష్ఫలో మొదట విజయ్ సేతుపతినే విలన్‌గా అనుకున్నారని, అయితే ఆయన డేట్స్ కుదరక చేయలేదని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక వీటితో పాటు త్వరలోనే తెలుగు ఇండస్ట్రీలోని స్టార్ హీరోల చిత్రాల్లో కూడా విజయ్ సేతుపతినే విలన్‌గా పెట్టేందుకు దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. విజయ్ సేతుపతి ఒక పక్క హీరోగా పలు చిత్రాల్లో నటిస్తూనే.. మరో పక్క క్యారెక్టర్ మంచిగా అనిపించే చిత్రాల్లోనూ నటిస్తున్నారు.

కాగా.. తెలుగు ఇండస్ట్రీలోకి డబ్బింగ్ సినిమా పిజ్జాతో విజయ్ సేతుపతి అడుగు పెట్టాడు. ఆ తర్వాత ఆయన నటించిన అనేక సినిమాలు తెలుగులో రిలీజయ్యాయి. ఉప్పెన చిత్రంలో ఆయన పాత్ర కనుక ప్రేక్షకులకు నచ్చితే తెలుగు ఇండస్ట్రీలో కూడా విజయ్ సేతుపతి ఇక మీదట బిజీ అయిపోతాడని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: