ఒకప్పుడు టాలీవుడ్‌ లో  సినీ ప్రేక్షకులను తన నటన, గ్లామర్‌తో అలరించిన నటి  భానుప్రియ. భానుప్రియ పుట్టినరోజు నేడు .. ఈ  సందర్భంగా భానుప్రియ సినీ జీవితం  గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం..

భానుప్రియ తెలుగులో సితార చిత్రం ద్వారా  అరంగ్రేట్రం చేసింది .. తొలి  చిత్రంతోనే హిట్ కొట్టిన భానుప్రియ ఇక వెనుతిరిగి చూడలేదు ..  సితార హిట్టవడంతో వంశీ- భానుప్రియ కాంబినేషన్ కు సపరేట్ క్రేజ్ వచ్చింది. ఈ ఇద్దరి కాంబినేషన్లో ప్రేమించు పెళ్లాడు, ఆలాపన, అన్వేషణ వంటి మంచి సినిమాలు వచ్చాయి .


ఇక కే. విశ్వనాథ్ స్వర్ణకమలం భానుప్రియ  సినీ కెరీర్ లోనే బెస్ట్ చిత్రం గా నిలుస్తుంది .. ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది ... ఇక  ఈ సినిమా పాటలు.. వాటికి భానుప్రియ మాత్రమే చేయగల డాన్సులూ అబ్బో.. చెప్పడం కంటే చూడ్డం బెటర్ అన్నారు ప్రేక్షకులు అయితే భానుప్రియ టాలీవుడ్ లోని  ప్రముఖ హీరోల  సరసన నటించింది  .. అందులో మెగాస్టార్ చిరంజీవి తో  విజేత, స్టేట్ రౌడీ, త్రినేత్రుడు.. ఇలా పలు చిత్రాల్లో  కలిసి నటించింది  .అయితే  చిరంజీవితో భాను ప్రియ చేసిన చిత్రాలన్నిటిలోకీ సెన్సషనల్ హిట్ పొందిన చిత్రం ఖైదీ నెంబర్ 786.  అలాగే  నటసింహం నందమూరి  బాలకృష్ణతోనూ అనసూయమ్మగారి అల్లుడు, భారతంలో బాలచంద్రుడు.. వంటి  చిత్రాలో  నటించింది ..


హీరోయిన్ గా కొన్ని చిత్రాలు చేసిన భానుప్రియ ఆ తర్వాత పెదరాయుడు వంటి చిత్రాల్లో క్యారెక్టర్  ఆర్టిస్టుగా   అద్భుతమైన పాత్రలలో  నటించింది ...  అంతేకాకుండా  గౌతమ్ ఎస్సెసీ, ఛత్రపతి సినిమాలను  చూస్తే భానుప్రియ నటన ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ..
ఇక తెలుగులో చివరగా ‘మహానటి’లో కీర్తి సురేష్ తల్లి పాత్రలో నటించింది భానుప్రియ
భానుప్రియ సినిమాలతో పాటు బుల్లి తెరపై కూడా పలు పాత్రలను పోషించింది  .అందులో భాగంగా  తెలుగులో ‘నాతిచరామి’ అనే టీవీ  సీరియల్లో నటించింది.

భానుప్రియ తన సినీ కెరీర్‌లో దాదాపు 110 సినిమాలు చేశారు. వీటిలో అనేక తెలుగు, తమిళ, మలయాళ, హిందీ సినిమాలున్నాయి. ముఖ్యంగా దేవత పాత్రలు అంటే దర్శకుల మొదటి చాయిస్ భానుప్రియనే ఎంచుకోవడం విశేషం ..





మరింత సమాచారం తెలుసుకోండి: