పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ సినిమా త్వరలో నే ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో సంక్రాంతి కానుకగా పవర్ స్టార్ ఫ్యాన్స్ కి టీజర్ ని గిఫ్ట్ గా ఇచ్చింది చిత్ర బృందం.  బాలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్ అయినా ఈ సినిమా ని ఇప్పటికే పలు భాషల్లో  రీమేక్ చేయగా అక్కడ కూడా సూపర్ హిట్ గా నిలిచింది.. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో కూడా ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.. అమితాబ్ నటించిన పాత్ర లో పవన్ కళ్యాణ్ నటిస్తుండడంతో సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి..

ఇకపోతే సంక్రాంతికి రిలీజ్ అయిన టీజర్ విషయంలో సినీ విశ్లేషకులు కొంత అసహనంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.  అందుకు కారణం టీజర్ లో పవన్ ను హైలైట్ చేయడమే అంటున్నారు.. ఒరిజినల్ వెర్షన్ ను పూర్తిగా మార్చేసి పవన్ ను హైలైట్ చేస్తూ ఈ సినిమా చేస్తున్నారనే అనుమానం వారిలో మొదటినుంచి ఉండగా ఇప్పుడు టీజర్ సాక్షిగా వారి అనుమానమే నిజమైంది అని చెప్పొచు. మహిళలపై జరిగే లైంగిక వేధింపుల నేపథ్యంలో సాగే కోర్ట్ రూం డ్రామా గా పేరున్న ఈ సినిమా ని పూర్తిగా పవన్ స్టైల్ లో తెరకెక్కిస్తున్నారని వారు ఆరోపణలు చేస్తున్నారు.

ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్లో ఇప్పటికే లేడీ క్యారెక్టర్లకు స్థానం లేకుండా చేశాడు. ఇప్పుడు టీజర్ కూడా పూర్తిగా పవన్ మీదే నడవడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.. ఈమాత్రం దానికి ‘పింక్’ను రీమేక్ చేయడం ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే అందరు చూసేసిన సినిమా ని రీమేక్ చేసి ధైర్యం చేస్తున్న పవన్ కళ్యాణ్ ఇలాంటి ఆరోపణలను మోస్తూ ఎంతవరకు హిట్ కొడతాడా చూడాలి. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా కి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా తొలి సారి పవన్ కళ్యాణ్ కు ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నాడు..


మరింత సమాచారం తెలుసుకోండి: