మామూలుగానే గుండె ఆపరేషన్ అంటే చాల భయం వేస్తుంది. ఇంత టెక్నాలజీ పెరిగిన రోజుల్లోనూ చిన్న చిన్న సర్జరీ అంటేనే హడలిపోతున్నారు. కానీ 50 ఏళ్ళ క్రితమే అక్కినేని నాగేశ్వర రావు చేయించుకున్న బైపాస్ ఆపరేషన్ వెనక ఉన్న భయానక కథ వింటే నిజంగా గ్రేట్ అనకుండా ఉండరు. అది 1975..ఆ రోజుల్లో ఇండియాలో బైపాస్ ఆపరేషన్లు చేయడం చాల క్లిష్టమైన పని. అందుకే స్టార్స్ ఎవరైనా గుండెకు సంబందించిన సమస్యలు ఉంటె నేరుగా అమెరికాకు వెళ్ళిపోయేవారు.

అక్కినేని కి సైతం బైపాస్ చేస్తే తప్ప బ్రతకరు అని డాక్టర్లు తేల్చి చెప్పారు. ఒకవేళ చేయించుకున్న కూడా అవకాశాలు తక్కువ అంటూ చెప్పడంతో ఏది జరిగితే అది జరగని అనుకోని అమెరికా కు ప్రయాణం అయ్యారు. చేయాల్సిన సినిమాలు అన్ని ఉన్నపలంగా పూర్తి చేసారు. మూడు నెలల పాటు బ్రేక్ తీసుకొని బైపాస్ ఆపరేషన్ చేయించుకొని ఇండియాకు తిరిగి వచ్చారు అక్కినేని. విజయవంతంగా అయన గుండెకు బైపాస్ జరగడంతో మద్రాసు తిరిగి వచ్చి అప్పటి తాజ్‌ కోరమండల్ హోటల్లో లో పెద్ద అభినందన సభ ఏర్పాటు చేసారు. ఆ సభకు దర్శక నిర్మాతలు విచ్చేయగా సీనియర్ ఎన్టీఆర్ అధ్యక్షత వహించారు. సినిమా పరంగా ఎన్ని విభేదాలు ఉన్న అక్కినేని ఆరోగ్యంగా తిరిగి రావడం పట్ల ఎంతో ఆత్మీయంగా ఎన్టీఆర్ ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు.ఇక హైదరాబాద్ విచ్చేసి అక్కినేని పాత్రికేయులకు సైతం పెద్ద విందు ఇచ్చారు. తాజ్ హోటల్ లో జరిగిన పాత్రికేయుల విందుకు మీడియా మిత్రులు అందరు విచ్చేయగా అక్కినేని షర్ట్ బటన్స్ విప్పి చూపించారు. అక్కడే ఉన్న పాత్రికేయులు ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. గుండెకు పైనుండి కింద వరకు కోసి కుట్లు వేసిన గుర్తులు చూసి ఒకింత భయపడ్డారు కూడా. ఆ తర్వాత సైతం అక్కినేని ఎంతో ఆరోగ్యంగా ఎన్నో సినిమాలు చేసారు. చివరి వరకు నటిస్తూనే కన్ను మూసారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: