మెగా స్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలకు కమర్షియల్ అంశాలు జోడించి సినిమా తీయడంలో కొరటాల శివ పనితనం ఏంటో అయన గత చిత్రాలు చూసి చెప్పొచ్చు. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా కి మణిశర్మ సంగీతం అందిస్తుండగా దేవాలయాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుండడం విశేషం..  ఇక ఈ సినిమా లో రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్ర లో నటిస్తున్న విషయం తెలిసిందే..

ముందుగా గెస్ట్ రోల్ లో నటింపచేయడానికే కొరటాల శివ ప్లాన్ చేసుకోగా పాత్ర ప్రాధాన్యం పెరిగిపోవడంతో ఈ పాత్ర నిడివి ని 30 నిముషాలు పెంచారు.. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ పాత్ర ను గంట కు పెంచుతున్నారట. ఈ విషయాన్నీ డైరెక్టర్ కొరటాల శివ నే స్వయంగా చెప్పడం విశేషం.. తండ్రి కొడుకులని ఒకే సినిమా లో చూపించే అదృష్టం తనకే దక్కిందని, ఆ విషయంలో తాను అదృష్టవంతుడనని అయన చెప్పుకొచ్చారు.

వారిద్దరి ని ఒకే ఫ్రేమ్ లో చూపించడానికి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నానని అన్నారు. వీరి కాంబినేషన్ లో వచ్చే సీన్ లు గూస్ బంప్స్ ఇచ్చేవిధంగా ఉంటాయని అన్నారు. అంతే కాకుండా వీరి కాంబో లో ఓ పాటను కూడా ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో జరుపుతున్నారు. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మాట్నీ మూవీస్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి - రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గతంలో మగధీర, బ్రూస్ లీ సినిమాలలో వీరిద్దరూ కొన్ని నిముషాలు కలిసి నటించగా ఇప్పుడు గంట అంటే మెగా అభిమానులకు పండగ అని చెప్పొచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి: