అగ్ర హాస్యనటుడు బ్రహ్మానందం గారు సినీ ఇండస్ట్రీకి పెద్దగా పరిచయం చేయనవసరం లేని వ్యక్తి. బ్రహ్మానందం గారు ఏ సినిమాలోనైనా నటిస్తున్నారు అంటే ఆ సినిమా ఆయన కామెడీతోనే హిట్ అవుతుంది. అంతేకాకుండా ఒక సినిమాకి హీరో ఎంత అవసరమో, కమెడియన్ కూడా అంతే అవసరం అవుతాడు.ఎవరైనా బాధలో ఉన్నప్పుడు కూడా బ్రహ్మానందం గారు చేసే కామెడీని చూస్తే ఇట్టే ఒత్తిడి నుంచి బయటపడవచ్చు. బ్రహ్మానందం గారిని మన హెల్త్ మెడిసిన్ అని కూడా చెప్పవచ్చు. ఎంత నవ్వితే అంత ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు ఎప్పటి నుంచో చెబుతున్నారు.కానీ బ్రహ్మానందం గారు తన నవ్వులతో మనందరినీ ఆరోగ్య వంతులను చేస్తున్నారు. అయితే ఇప్పుడు సరికొత్తగా కామెడీ నటనకు పులిస్టాప్ పెట్టబోతున్నారు బ్రహ్మానందం గారు. దానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం

బ్రహ్మానందంగారు రీసెంట్ గా హార్ట్ సర్జరీ చేయించుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ హార్ట్ సర్జరీ తర్వాత ఎక్కువ రిస్కు తీసుకునేందుకు ఇష్టపడడం లేదు. ఇప్పుడు మళ్లీ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని అనుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే.  అయితే ఈసారి కమెడియన్ నుంచి మరో సరికొత్త క్యారెక్టర్ లోకి అడుగుపెట్టబోతున్నాడు బ్రహ్మానందం గారు. కృష్ణవంశీ దర్శకత్వంలో రంగమార్తాండ సినిమా వస్తున్న విషయం అందరికి తెలిసిందే.

అయితే ఈ సినిమాలో బ్రహ్మానందం గారి రోల్ ఇప్పటి వరకు చేసిన రోల్స్ కు భిన్నంగా ఉంటుందని, ప్రేక్షకులు కచ్చితంగా సర్ప్రైజ్ అవుతారని అంటున్నారు.ఇన్నాళ్లు తన కామెడీతో మన అందరినీ నవ్వించిన బ్రహ్మానందం గారు ఇప్పుడు మనం అందరరిని  ఏడిపించబోతున్నారట.

అంతేకాకుండా బ్రహ్మానందం గారు గతంలో తనదైన శైలిలో బాబాయ్ హోటల్ సినిమాలో ఒక సీరియస్ రోల్ లో నటించి అందరినీ ఏడిపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి కొత్తగా మన ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న బ్రహ్మానందం గారి పోస్టర్ ని చూసి అందరూ చర్చలు మొదలు పెట్టారు. ఎప్పుడూ నవ్వించే బ్రహ్మానందం గారు ఇప్పుడు ఎలా ఏడిపిస్తారు అని అందరూ ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: