సాధారణంగా మనలో చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. ఎన్ని ఎక్సర్సైజులు, డైట్ మెయింటెన్ చేసినప్పటికీ కూడా అధిక బరువును తగ్గించుకోవాలేకపోతున్నారు.1 నుంచి 2 కేజీలు తగ్గడానికే మనలో చాలామంది సతమతమవుతుంటే, వీరు ఏకంగా కేజీలకు కేజీలు బరువును  సింపుల్ గా తగ్గి  చూపించారు. బరువు తగ్గాలన్న ఇంటెన్షన్,  నిపుణులైన ట్రైనర్లు, క్రమం తప్పకుండా వ్యాయామం, డైట్ మెయింటైన్ చేయడం లాంటి ఎన్నో పద్దతులను సక్రమంగా పాటించి, ఫ్యాట్  నుంచి ఫిట్గా మారి చూపించారు. ఇప్పుడు ఆ సెలబ్రిటీలు ఎవరో చూద్దాం..

సారా అలీఖాన్:
బాలీవుడ్ నటి సారా అలీఖాన్ సినిమాల్లోకి రాకముందు ఈమె ఏకంగా 96 కేజీలకు పైగా ఉండేదట. సినిమాల్లోకి రావాలన్న  ఇంటెన్షన్ తో ఏడాది పాటు తీవ్రంగా శ్రమించి, తన బరువును  50 కేజీలకు తెచ్చుకుంది. సారా ని  ఎప్పుడైనా?ఎవరైనా? ఫ్యాట్ నుంచి ఫిట్ గా ఎలా మారారు అని అడిగితే! నేను బరువు తగ్గడానికి జిమ్ కీలకం అంటారామె.

అనంత్ అంబానీ:
బిజినెస్ మాగ్నెట్ ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ.  18 నెలల కాలంలో దాదాపు నూట ఎనిమిది కేజీల బరువు తగ్గి, సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇందుకుగాను ప్రతిరోజు 21 కిలోమీటర్ల వాకింగ్, 5 గంటలు  జిమ్ చేసేవాడట. అంతేకాకుండా స్ట్రిక్ట్  డైటింగ్ కూడా చేసేవాడట.

గణేష్ ఆచార్య:
ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ 17 నెలలు శ్రమించి, దాదాపు 85 కేజీల బరువు తగ్గారట. అంతే కాకుండా ఆయన చేసిన వర్కౌట్స్ తను బరువు తగ్గడంలో  కారణం అయ్యాయని  ఎప్పుడూ అంటుంటారు.

అద్నాన్ స‌మి:
సింగర్, మ్యూజిషియన్ అయిన అద్నాన్ సమీ, 16 నెలల వ్యవధిలో మొత్తం 160 కేజీల బరువు తగ్గాడు. డైట్ తో పాటు మంచి వ్యాయామం చేయడం లాంటివి  ఈ బరువు తగ్గడం వెనుక కారణాలు అట.

ఇన్ని కేజీల బరువును తగ్గడానికి గల కారణం బరువు తగ్గాలన్న ఇంటెన్షన్,  నిపుణులైన ట్రైనర్లు, క్రమం తప్పకుండా వ్యాయామం డైట్ మెయింటైన్ చేయడం.  ఇక ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా  ఈ పద్ధతులను పాటించి,మీ బరువును కేజీలకు కేజీలు తగ్గించుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: