పోలీస్ వేషాలు వేసి హిట్ కొట్టడం 90's స్టార్టింగ్ లో జరిగింది. ఆ తర్వాత పోలీస్ రోల్స్  రొటీన్ అయిపోయి అందులో అంత జోష్ లేకుండా పోయింది. దీంతో ట్రాక్ మార్చిన హీరోలు... తమకు బ్రేక్ ఇస్తుందనే నమ్మకంతో పోలీస్ సినిమాలు టేకప్ చేస్తున్నారు.

టాప్ హీరోలందరూ పోలీస్ రోల్స్ కు షిఫ్ట్ అవుతున్నారు. ఫ్లాప్ ల మీదున్న కథానాయకులకు పోలీసు పాత్రలు ఏదో ఒక రకంగా కలిసొస్తాయని.. హీరోయిజాన్ని పెంచుతాయని నమ్ముతున్నారు. ఇంకొందరు సీబీఐ, ఇంటర్ పోల్ పోలీసర్ గా కాస్త వెస్ట్రన్ లుక్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మహేష్ బాబుకు దూకుడు అలాగే ప్లస్ అయింది.

దూకుడులో మహేష్ చూపించిన పర్ ఫార్మెన్స్ కు బాక్సాఫీస్ షేక్ అయింది. ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు టెంపర్ మాంచి రిలీఫ్ ఇచ్చింది. సాలీడ్ కంత్రీ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో తారక్ అదరగొట్టిన తీరు ఆడియన్స్  తో అదుర్స్ అనిపించేలా చేసింది. ఒకరకంగా పోలీస్ రోల్ లో తారక్ ఇంతలా ఫిట్ అవుతాడని ముందుగా ఎవ్వరు అనుకోలేదు. ఫిలిం రిలీజై హిట్ కొట్టాక కంటెంట్ సినిమాలోనే కాదు యంగ్ టైగర్ లో కూడా ఉందని కన్ఫామ్ అయింది.

తాజాగా క్రాక్ తో మాస్ రాజా రవితేజ సైతం పోలీస్ పాత్ర తనకు ఎప్పుడూ సెట్ అవుతుందని మరోసారి ప్రూవ్ చేశాడు. విక్రమార్కుడుతో మొదలుపెట్టిన పర్ ఫార్మెన్స్ బెంగాల్ టైగర్ తో పీక్స్ కు వెళ్లింది. ఆ తర్వాత పవర్ లోను ఇలాగే అదరగొట్టాడు. తాజాగా క్రాక్ తో ఇచ్చిన ఎనర్జీ సూపర్బ్ గా పేలడంతో పరిశ్రమలో పోలీస్ పాత్రలపై మళ్లీ డిస్కషన్ ఊపందుకుంది. ఫ్లాప్ లో ఉన్న హీరోలకు ఓ పోలీస్ సినిమా పడితే లైన్ లో కొచ్చేస్తారని టాక్ అయితే నడుస్తుంది. మొత్తానికి పోలీస్ క్యారెక్టర్ తో వచ్చే సినిమాలు ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరోల్లో ఆశలు రేకెత్తిస్తూనే ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: