కరోనా వైరస్ కారణంగా థియేటర్ కి వెళ్లి సినిమాలు చూసే అవకాశం లేకపోయింది. దాదాపు కొన్ని నెలల తరువాత, ఒక పెద్ద సినిమా ఇప్పుడు సినిమా హాల్స్ ను సందడిగా మార్చిందని చెప్పాలి. తమిళ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసే తరుణం వచ్చేసింది. తమిళ స్టార్ హీరో విజ‌య్, విల‌క్ష‌ణ న‌టుడు విజ‌య్ సేతుప‌తి ప్ర‌ధాన పాత్ర‌ల్లో లోకేష్ క‌న‌గ‌రాజు తెర‌కెక్కించిన మాస్ట‌ర్ సినిమా సంక్రాతి కానుకగా జనవరి 13 న థియేట‌ర్ల‌లోకి వచ్చేసింది. సినిమా చుసిన ప్రేక్షకులు ఈ మూవి గురించి   పాజిటివ్ గానే స్పందిస్తున్నారు.  ఇక తమిళనాట విజ‌య్‌కు ఉన్న క్రేజ్‌తో బాక్సాఫీస్ వద్ద కూడా మాస్ట‌ర్ దుమ్ముదులిపేస్తున్నాడు.క‌లెక్ష‌న్ల‌ పరంగా కూడా ముందుకు దూసుకుని వెళుతున్నాడు విజ‌య్. అయితే ఈ సినిమాలో ఉన్న ఒక  పెంపుడు జంతువు అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ జంతువు మరేంటో కాదు. మనం తెల్లారితే ఎప్పుడో ఒకప్పుడు మనం విధుల్లో చూసే పిల్లి. సినిమా చూడని వారికీ ఈ పిల్లి గురించి తెలియదు అనుకోండి. కానీ  ఈ మూవీ చూసిన వారంద‌రికీ ఇందులో పిల్లి గురించి తెలిసే ఉంటుంది.

 మాస్ట‌ర్‌లో విజ‌య్ పెంపుడు జంతువుగా ఈ పిల్లి కనిపిస్తుంది. అయితే ఈ పిల్లి  చాలా కీల‌క స‌న్నివేశాల్లోనూ క‌నిపించింది. అలాగే ఆ మ‌ధ్య‌న ఈ పిల్లితో విజ‌య్ సేతుప‌తి కూడా ఓ ఫొటోకు ఫోజిచ్చారు.ఇంకేముంది ఈ పిల్లి గురించి అందరిలో ఆసక్తి మొదలయింది.ఈ క్రమంలో మాస్టర్ సినిమాలో నటించిన  పిల్లి గురించి కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలుసుకుందాం.

ఎక్సాటిక్ బ్రీడ్ త‌రువాత ఈ ప‌ర్షియ‌న్ పిల్లికి మంచి డిమాండ్ ఉంటుందట‌. ఇది 16 శ‌తాబ్దంలో ఇటలీ నుంచి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. దీని విలువ కూడా చాలా ఎక్కువనట .చిన్న పిల్ల అయితే 10 నుంచి 20వేలు ప‌లుకుతుంద‌ని.. అదే కొంచెం పెద్ద పిల్లి అయితే 25 నుంచి 30 వేల వ‌ర‌కు ప‌లుకుతుంద‌ని వినికిడి.వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా గాని ఇది నిజమే.. ఈ సినిమా చుసిన తరువాత ఈ పిల్లి డిమాండ్ మరింత పెరిగిపోతుంది. ఈ పిల్లిని కొనుగోలు చేసేందుకు ఇప్పుడు చాలామంది  ఆస‌క్తిని చూపుతున్న‌ట్లు తెలుస్తోంది.. !

మరింత సమాచారం తెలుసుకోండి: