మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమా సంక్రాంతి రేసులో ముందు ఉంది. ఏడాది సంక్రాంతి సీజన్ లో మొట్టమొదటి సినిమాగా రిలీజ్ అయిన క్రాక్ సంక్రాంతి రేసులో కూడా ముందే ఉంది. రాజా ది గ్రేట్ సినిమా తర్వాత రవితేజకు ఆ స్థాయిలో చెప్పుకోదగ్గ సినిమాగా క్రాక్ నిలిచింది. ఇక ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకోవడంతో ఈ సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ మధ్యకాలంలో అన్ని భాషల్లో హిట్ అయిన సినిమాలను వేరే వేరే భాషల వాళ్ళు వీలైనంత త్వరగా రైట్స్ దక్కించుకుని రీమేక్స్ చేసేస్తున్నారు. 


ఇప్పటికే తెలుగులో దాదాపుగా చాలా రీమేక్ సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. తాజాగా అందుతున్న సమాచారం మేరకు క్రాక్ సినిమాని బాలీవుడ్ లో సోనూసూద్ హీరోగా తెరకెక్కనున్నట్టు సమాచారం. నిజానికి కొద్ది రోజుల క్రితం సోనూసూద్ ఇకమీదట తను విలన్ పాత్రలలో నటించనని, హీరో పాత్రలలో మాత్రమే నటిస్తానని చెప్పుకొచ్చాడు. ప్రజలు తన విలన్ పాత్రలలో చూసేందుకు సిద్ధంగా లేరన ఆయన ఇక మీదట ప్రొడ్యూసర్స్ ని ఇబ్బంది పెట్ట దలుచుకోలేదు అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాని కూడా సోనూసూద్ స్వయంగా నిర్మించే అవకాశాలు కనిపిస్తున్నాయి.


ఇప్పటికే ఈ సినిమా బాలీవుడ్ రైట్స్ కావాలంటూ నిర్మాత ఠాగూర్ మధుని సోనుసూద్ టీమ్ సంప్రదించినట్లు తెలుస్తోంది. ఒకవేళ రేట్ ఫైనల్ అయితే ఈ సినిమాని వెంటనే కొనేసి సోనూసూద్ షూటింగ్ కూడా మొదలు పెట్టే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఒప్పుకున్న సినిమాలన్నీ పూర్తి చేసేసి ఆ తర్వాత ఈ సినిమా సెట్స్ మీదకు తీసుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఇక ప్రస్తుతానికి సోనూసూద్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: