2021 లో మెగాస్టార్ సినిమాల జోరును పెంచాడు. వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఒక్కొక్కటిగా వాటిని తెరకెక్కించే పనిలో పడ్డారు మెగాస్టార్. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆచార్య మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీ ప్రేక్షకుల్లో అంచనాలను ఓ రేంజ్ లో పెంచుతోంది. దీనికి తోడు ఈ సినిమాలో చిరంజీవి తో పాటుగా రామ్ చరణ్ కూడా స్క్రీన్ పంచుకోబోతున్నాడన్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పటికీ ఈ తండ్రీ కొడుకులు కలిసి మగధీర, బ్రూస్ లీ సినిమాలలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. చిరు, రామ్ చరణ్ లు ఒకే స్క్రీన్ పై కనిపించడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. మళ్లీ వారి అభిమానులను సర్ ప్రైజ్ చెయ్యడానికి ఈ మెగా తండ్రీ కొడుకులు సిద్ధమవుతున్నారు.
 కాగా ఈ ఆచార్యలో చరణ్ కోసం ఇంతకు ముందు కొరటాల గెస్ట్ రోల్ క్రియేట్ చేశాడు. కానీ గెస్ట్ రోల్ తీసేసి ఫుల్ లెన్త్ రోల్ గా మార్చినట్టు తెలుస్తున్నది. అంటే ఆచార్యలో ఉన్న 30 నిమిషాల చరణ్ పాత్రను కాస్త ఒక గంటకు పెంచారట డైరెక్టర్ కొరటాల శివ. కాగా ఈ మధ్యనే ఓ ఇంటర్వ్యూలో కొరటాల శివ మాట్లాడుతూ.. చరణ్ రోల్ పై ప్రేక్షకులకు ఒక క్లారిటీ కూడా ఇచ్చాడు. ఆచార్య మూవీలో రామ్ చరణ్ ఫుల్ లెంగ్త్ రోల్ పోషిస్తున్నాడని తెలిపాడు. అదీ కాక తను నటించే పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతోందని తెలిపాడు కొరటాల. అలాగే తండ్రీ కొడుకులను కలిపి డైరెక్ట్ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పుకొచ్చాడు

డైరెక్టర్ కొరటాల. అదీ కాక చిరంజీవి, రామ్ చరణ్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారని చెప్పుకొచ్చాడు.అయితే చిరు, చరణ్ మధ్యలో వచ్చే సన్నివేశాలు గూస్బమ్స్ కలిగించేలా ఉండబోతున్నాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి. చరణ్ ఈ మధ్యనే కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారన్న విషయం తెలిసిందే. దాంతో ఈ హీరో ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో కూడా పాలుపంచుకుంటున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. అయితే అతి తొందరలోనే ఆచార్య కోసం చరణ్, చిరంజీవిలతో కలిసి ఓ సాంగ్ చిత్రీకరణకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. వీలైనంత తొందరలోనే రామ్ చరణ్ ఆచార్య సెట్ లో అడుగుపెడతాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఈ ఆచార్య మూవీలో తండ్రీకొడుకులు ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టు

మరింత సమాచారం తెలుసుకోండి: