ఈ సంక్రాంతికి తమ సినిమాలతో రాలేని తారలంతా అప్ కమింగ్ ఫిలింస్ పోస్టర్లతో పండుగ వాతావరణం తీసుకువచ్చారు. ఫ్యామిలీ టచ్, లవ్లీ పిక్స్ తో పొంగల్ ఫ్లేవర్ ను ఒడిసిపట్టి మరీ.. తమ అప్ డేట్స్ ను ఆడియన్స్ ముందుకు తెచ్చారు. తాజాగా టాలీవుడ్ లవర్ బాయ్స్  సంక్రాంతి రోజు తమ కొత్త లుక్ లతో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యారు.

సంక్రాంతికి వచ్చే సినిమాలేంటో రాబోయె పోస్టర్లేంటో అందరికీ ముందుగానే తెలిసిపోయింది. అయితే  కొన్ని చోటా సినిమాలు తమ అప్ డేట్స్ తో సంక్రాంతి విషెస్ చెబుతూ సినీ ప్రేక్షకులను పలకరించాయి. కానీ సంక్రాంతి పోస్టర్లుగా వచ్చిన ఫ్యామిలీ ఓరియెంటెడ్ ఫిలింస్ పోస్టర్లు ,కూల్ లవ్ స్టోరీల తాలుకు లేటెస్ట్ లవ్లీ పిక్స్ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తీసుకువచ్చాయి. వాటిలో రంగ్ దే తో పాటు వరుడు కావలెను పోస్టర్లు ఉండడం విశేషం.

సంక్రాంతి శుభాకాంక్షలతో రంగ్ దే` టీమ్ రిలీజ్ చేసిన పోస్టర్లలో ఈ పోస్టర్ ఎంతో  కలర్ ఫుల్ గా ఉంది. హీరో, హీరోయిన్లు ట్రెడిషనల్ లుక్ తో కనిపించారు. కీర్తి సురేష్ పట్టు చీర కట్టుకుని ఆభరణాలు ధరించి వాలుజడతో చిరునవ్వులు రువ్వుతూ  ముద్దొచ్చే పోజుతో ఓ చూపు చూసింది. పాపిడి బొట్టుతో ఉన్న కీర్తి తన ఫోన్ లో హీరో నితిన్ కి ఏదో చూపిస్తోంది. ఇక నితిన్ సైతం సుందరాంగుడిలా ట్రెడిషనల్ వేర్ లో మెరూన్ కలర్ కుర్తాలో లవర్ బాయ్ గా ఆకట్టుకున్నాడు.ఫొటో చూస్తుంటేనే ఇంతే కలర్ ఫుల్ గా ఉంది...రేపు సినిమా ఇంకెంత బ్యూటిఫుల్ గా ఉంటుందో నని సోషల్ మీడియాలో పాజిటివ్ గా కామెంట్స్ పడుతున్నాయి.

నితిన్ ముచ్చట ఇలా ఉంటే... నాగశౌర్య ఇందుకు తగ్గకుండానే కలరింగ్ ఇస్తున్నాడు. తనకు  ముందునుంచి అచ్చొచ్చిన ఫ్యామిలీ ఓరియెంటెడ్ కంటెంట్ తోనే మరోసారి వస్తున్నాడు. అప్పట్లో శతమానం భవతి.. అమ్మమ్మ గారిల్లు లాంటివి ఉమ్మడి కుటుంబ వ్యవస్థపై వచ్చిన చిత్రాలు. ఆ తర్వాత ఆ తరహా సినిమాలు  వచ్చినా అవి అంతగా ఆకట్టుకున్న దాఖలాలు లేవు. సంక్రాంతి రోజు బయటకు వచ్చిన నాగశౌర్య వరుడు కావలెను పోస్టర్ తో మళ్లీ పాజిటివ్ వైబ్రేషన్స్  వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: