సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు.. ఎవ్వరికి.. ఎలా..అదృష్టం కలిసి వస్తుందో తెలియదు. ఒక్కోసారి ఎన్ని సినిమాల్లో నటించినగాని విజయం సొంతం అవ్వదు.అలాగే  కొన్ని కొన్ని సార్లు ఒక సినిమాతోనే స్టార్ డమ్ సొంతం అవుతుంది. అలాగే సినీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. ఫలానా డైరెక్టర్ అయితే సినిమా తప్పకుండా  హిట్ అవుతుంది.. ఆ  హీరోయిన్ నటిస్తే  సినిమా హిట్ అయిపోతుంది ఇలా కొన్ని సార్లు కొన్ని సెంటిమెంట్స్ ఫాలో అవుతూ ఉంటారు. అలా..కొంతమంది  టాలీవుడ్ హీరోస్  లైఫ్ ని మార్చేసింది ఒక హీరోయిన్. వరస ప్లాప్ లతో ఉన్న a హీరోలకు సక్సెస్ రుచి చూపించింది ఆ హీరోయిన్. ఆవిడ మరెవరో కాదు...  పిల్లి కళ్ళ సుందరి శృతి హాసన్. ఇంతకీ ఈ హీరోయిన్ తో నటించి లక్ ని సొంతం చేసుకున్న ఆ టాలీవుడ్  హీరోలు ఎవరు.? ఏంటో చూద్దాం.. !!

ముందుగా ఈ లిస్ట్ లో  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తాడు. పవర్ స్టార్ క్రెజ్  గురించి  కొత్తగా చెప్పాలిసిన పని లేదు. ఎందుకంటే ఆయన నటించిన సినిమాలు  హిట్ అయిన,  ప్లాప్ అయిన గాని ఆయన రేంజ్ మాత్రం తగ్గదు. వరుసగా పవర్ స్టార్ నటించిన మూడు సినిమాలు ఫ్లాపు అవ్వడంతో, తరువాత తీసిన గబ్బర్ సింగ్ సూపర్ హిట్ అయింది . శృతి హాసన్ పవన్ కళ్యాణ్ జంట గా నటించిన “గబ్బర్ సింగ్” ఓ రేంజ్ లో హిట్ అయింది. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబుకి కూడా శృతి హాసన్ లక్ ఇచ్చిన హీరోయిన్ అనే చెప్పాలి. ఇలానే జరిగింది. నేనొక్కడినే, ఆగడు సినిమాలు థియేటర్ లో అంతగా నిలదొక్కుకోలేదు. ఈ రెండు ఫ్లాప్స్ తరువాత వచ్చిన శ్రీమంతుడు సినిమా సూపర్ హిట్ అయ్యింది.ఈ సినిమా లో మహేష్ బాబు సరసన శృతి హాసన్ నటించారు.

తాజాగా, రవితేజ “క్రాక్” సినిమా తో మాస్ కామ్ బ్యాక్ ఇచ్చారు. ఈ సినిమా లో శృతి హాసన్ హీరోయిన్. దాదాపు నాలుగు ఫ్లాపుల తరువాత రవితేజ సూపర్ హిట్ కొట్టాడు.  తాజాగా, రవితేజ శృతి హాసన్ జంటగా నటించిన “క్రాక్” సినిమా మాత్రం థియేటర్ లో మంచి టాక్ తెచ్చుకుంటోంది.రవితేజ కి కూడా శృతిహాసన్ అదృష్ట దేవత అని చెప్పాలి. అలాగే అల్లు అర్జున్ కి కూడా శృతి హాసన్ లక్కీ అనే చెప్పాలి. ఇద్దరమ్మాయిలతో సినిమాల ఫ్లాప్ అయ్యాక, శ్రుతీ హాసన్ తో జంటగా చేసిన సినిమా “రేసు గుర్రం” బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొట్టేసింది.ఇంకా, నాగ చైతన్య కి కూడా శ్రుతీ హాసన్ కలిసొచ్చింది. ఆటోనగర్ సూర్య, దోచేయ్ సినిమాలు ఫ్లాప్ అయ్యాక, శృతి హాసన్ తో కలిసి చేసిన “ప్రేమమ్” సినిమా సూపర్ హిట్ అయ్యింది.అలా నాగ చైతన్యకి శృతి హాసన్ కుడా లక్కీ అనే చెప్పాలి. !!

మరింత సమాచారం తెలుసుకోండి: