బాలీవుడ్‌లో హీరోల క‌న్నా... చాలా మంది హీరోయిన్లే బిజీ బిజీగా ఉంటున్నారు. ఈ లిస్టులో చాలా మంది హీరోయిన్లు ఉన్నా వీరిలో ఆలియా భ‌ట్‌కు విప‌రీత‌మైన క్రేజ్ ఉంది. ప్ర‌తి సినిమాకు ఈ అమ్మ‌డి క్రేజ్ మామూలుగా పెర‌గ‌డం లేదు. ప్ర‌స్తుతం తెలుగులో రాజ‌మౌళి క్రేజీ ప్రాజెక్టు ఆర్.ఆర్.ఆర్ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ ప‌క్క‌న న‌టిస్తోంది. రాజ‌మౌళి బాహుబ‌లి త‌ర్వాత తెర‌కెక్కిస్తోన్న సినిమా కావ‌డంతో ఈ సినిమాపై మామూలు అంచ‌నాలు లేవు. ఈ సినిమా త‌ర్వాత ఆలియా క్రేజ్ ద‌క్షిణాదిలో కూడా డ‌బుల్ కానుంది. ఈ సినిమా కోస‌మే రెండు నెల‌లుగా ఎంతో క‌ష్ట‌ప‌డి తెలుగు నేర్చుకోవ‌డంతో పాటు తెలుగు డైలాగులు సైతం చ‌క‌చ‌కా చెపుతోంద‌ట‌.

ఆర్ ఆర్ ఆర్ తో పాటు ఆలియా బాలీవుడ్‌లో సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న గంగుభాయి కతీయవాడి సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా అలియా కెరీర్ లో చాలా స్పెషల్ గా ఉండ‌బోతోంద‌ని తెలుస్తోంది. ఈ సినిమాలో ఆలియా ముంబై మ‌హా న‌గ‌రంలో ఫేమ‌స్ బ్రోత‌ల్ ఏరియా అయిన కంటీపుర‌లో ఓ బ్రోత‌ల్ హౌస్ ఓన‌ర్‌గా క‌నిపించ బోతోంద‌ట‌. గతంలో ఈ ఏరియాకే చెందిన ఫేమ‌స్ బ్రోత‌ల్ హౌస్ ఓన‌ర్‌గా గంగుబాయికి పేరుంది. ఇప్పుడు ఆలియా సైతం య‌వ్వ‌నం నుంచి ముస‌లి త‌నం వ‌ర‌కు ఎలా ఉందో .. ఇప్పుడు ఆలియా సైతం అలాగే క‌నిపించేందుకు ఎంతో క‌స‌ర‌త్తులు చేస్తోంద‌ట‌.

ఎప్పుడో షూటింగ్ ప్రారంభ‌మైన ఈ సినిమా లాక్ డౌన్ లేక‌పోతే ఈ పాటికే రిలీజ్ అయ్యి ఉండేది. ఈ సినిమాను ద‌స‌రా కానుక‌గా హిందీతో పాటు ప‌లు ప్రాంతీయ భాష‌ల్లో రిలీజ్ చేసే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌. ఆర్.ఆర్.ఆర్ సినిమాతో ఆలియా తెలుగులో తిరుగులేని క్రేజ్ తెచ్చుకుంటుంద‌ని.. అందుకే ఈ సినిమాను ఇక్క‌డ కూడా రిలీజ్ చేయాల‌ని మేకర్స్ భావిస్తున్నారు.

అలియా గంగుబాయి పాత్ర పట్ల చాలా ఆసక్తిగా ఉన్నట్లు సినీవర్గాలు భావిస్తున్నాయి. మ‌రి ఫేమ‌స్ బ్రోత‌ల్ హౌస్ ఓన‌ర్‌గా ఆలియా ఎన్ని సంచ‌ల‌నాలు క్రియేట్ చేస్తుందో ?  చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: