ఒకే హీరో కి కంటిన్యూస్ గా 3 హిట్స్ ఇచ్చిన టాలీవుడ్ దర్శకులు చాలామంది ఉన్నారు. ఒకే డైరెక్టర్-హీరో కాంబినేషన్ లో హ్యాట్రిక్ హిట్స్ గా నిలిచిన మూవీస్ ఏంటో ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం.

1. పూరి జగన్నాథ్ - రవితేజ

2001లో రవితేజ - పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమా విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీలో మ్యూజిక్ డైరెక్టర్ చక్రి స్వరపరిచిన పాటలు అత్యంత ప్రజాదరణ పొందాయి. 2002లో వచ్చిన ఇడియట్ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. 2003లో వచ్చిన అమ్మానాన్న తమిళ అమ్మాయి సినిమా సూపర్ హిట్ అయ్యింది. దీనితో రవితేజ - పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో విడుదలైన 3 సినిమాలు హ్యాట్రిక్ హిట్స్ గా నిలిచాయి.

2. త్రివిక్రమ్ శ్రీనివాస్ - అల్లు అర్జున్

త్రివిక్రమ్ శ్రీనివాస్ - అల్లు అర్జున్ కాంబినేషన్ లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో సినిమాలు రూపొంది బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి.

3. వి.వి వినాయక్ - జూనియర్ ఎన్టీఆర్

ఆది, అదుర్స్, సాంబ చిత్రాలు v VINAYAK' target='_blank' title='వి వి వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వి వి వినాయక్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో జరిగాయి. ఈ మూడు కూడా హిట్స్ అయ్యాయి.

4. ఎస్.ఎస్ రాజమౌళి - జూనియర్ ఎన్టీఆర్

రాజమౌళి తో 3 సినిమాలలో నటించిన ఏకైక టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పుకోవచ్చు. స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి, యమదొంగ చక్కన తారక్ కాంబినేషన్ లో తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి.

5. ప్రభాస్ - ఎస్.ఎస్ రాజమౌళి

హ్యాండ్సమ్ హీరో ప్రభాస్ తో దర్శకుడు రాజమౌళి మూడు సినిమాలను తెరకెక్కించారు. 2005 లో ఛత్రపతి మూవీ వీరిద్దరి కాంబినేషన్ లో రూపొంది బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 10 సంవత్సరాల తర్వాత రాజమౌళి ప్రభాస్ కాంబినేషన్ లో బాహుబలి సినిమా హిట్ గా నిలిచింది. ఆతర్వాత బాహుబలి పార్ట్ 2 రిలీజ్ అయ్యి అన్ని రికార్డులను బద్దలు కొట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: