టాలీవుడ్‌లో సంక్రాంతికి సినిమా హంగామా మామూలుగా ఉండ‌దు. గ‌తేడాది కూడా ఏకంగా నాలుగు సినిమాలు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చాయి. వీటిల్లో స‌రిలేరు నీకెవ్వ‌రు, అల వైకుంఠ‌పురంలో రెండు సినిమాలు హిట్ అవ్వ‌గా... క‌ళ్యాణ్‌రామ్ ఎంత మంచివాడ‌వురా, ర‌జ‌నీ ద‌ర్బార్ ప్లాప్ అయ్యాయి. ఇక సుధీర్ఘ‌మైన లాక్ డౌన్ త‌ర్వాత ఈ సంక్రాంతికి కూడా నాలుగు సినిమాలు బాక్సాఫీస్ బ‌రిలో నిలిచాయి. వీటిలో విజ‌య్ మాస్ట‌ర్ డ‌బ్బింగ్ మూవీ కాగా.. మిగిలిన మూడు నేరుగా తెలుగు సినిమాలు.
వీటిల్లో ర‌వితేజ క్రాక్ మూవీ ఓ వారం రోజుల ముందుగానే వ‌చ్చింది. తొలి రోజు ఫైనాన్స్ ప్రాబ్ల‌మ్స్ క్లీయ‌ర్ అయ్యాక కాని రాత్రికి కాని థియేట‌ర్ల‌లో బొమ్మ ప‌డ‌లేదు. ద‌ర్శ‌కుడు మ‌లినేని గోపీచంద్ ఉరమాస్ సినిమాగా క్రాక్‌ను తెర‌కెక్కించ‌డంతో సినిమాకు ముందు నుంచి హిట్ టాక్ ర‌న్ అవుతోంది. పైగా మాస్‌, బీ, సీ సెంట‌ర్ల వాళ్ల‌కు సినిమా బాగా ఎక్కేసింది. ఇక విజ‌య్ మాస్ట‌ర్ అభిమానుల‌ను సైతం పూర్తిగా మెప్పించ‌లేదు. కంటెంట్ పరంగా మాస్ట‌ర్ చాలా మందిని డిజ‌ప్పాయింట్ చేసింది.
అయితే మాస్ట‌ర్ తెలుగులో మాత్రం క‌మ‌ర్షియ‌ల్‌గా సేఫే. ఇక రామ్ రెడ్‌కు తొలి రోజు వ‌సూళ్లు రు. 7 కోట్ల వ‌ర‌కు ఉన్నా.. త‌ర్వాత టాక్ బ్యాడ్‌గా ఉంది. రామ్‌కు ఉన్న క్రేజ్ ప‌రంగా పండ‌గ మూడు రోజులు నిల‌బ‌డినా త‌ర్వాత రెడ్ క‌ష్ట‌మే అంటున్నారు. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ - కందిరీగ సంతోష్ శ్రీనివాస్ కాంబోలో వ‌చ్చిన అల్లుడు అదుర్స్ ఏకంగా అల్లుడు బెదుర్స్ అనిపించుకుంది. కామెడీ పేరిట సంతోష్ శ్రీనివాస్ చేసిన కిచిడీ బెల్లంకొండ శ్రీనివాస్ ఆశలను ఆవిరి చేసింది.
అస‌లు బెల్లంకొండ కెరీర్లోనే ఈ సినిమా ఘోర‌మైన వీక్ అన్న టాక్ తెచ్చుకుంది. ఓవ‌రాల్‌గా ఈ నాలుగు సినిమాల ర్యాకింగ్‌లు చూస్తే 1 - క్రాక్‌, 2- రెడ్ , 3- మాస్ట‌ర్ , 4- అల్లుడు అదుర్స్ సినిమాలు నిలిచాయ‌నే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: