"సుడిగాడు" చిత్రంలో అల్లరి నరేష్ సరసన నటించిన మోనాల్ గజ్జర్ ఆ తరువాత "బ్రదర్ ఆఫ్ బొమ్మాళి"లో కూడా తళుక్కుమంది. కానీ, ఈ గుజరాతీ భామకు టాలీవుడ్ లో తగినంత గుర్తింపు లభించలేదు. చాలా కాలం గ్యాప్ తరువాత బిగ్ బాస్ రియాలిటీ షోతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సుందరి. భాష రాకపోయినా తెలుగుపై మక్కువతో ఆడియెన్స్ ను అలరించాలన్న దృఢసంకల్పంతో హౌస్ ఎలా ఎన్నో ఒడిదుడుకలను ఎదుర్కొని కొనసాగింది. త్రుటిలో టాప్ 5లో ఉండే ఛాన్స్ ను మిస్సయింది.

బిగ్ బాస్ హౌస్ లోకి ఓ స్ట్రాటజీతోనే ఎంటరయ్యాయని చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ షోలో పాల్గొన్నవాళ్లకు ఇండస్ట్రీలో అవకాశాలు ఎక్కువగా రావన్న టాక్ నడుస్తోంది. అటువంటి టాక్ ను బ్రేక్ చేయాలని హౌస్ లోకి ఎంటరైందట ఈ భామ. బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసినవారికి కూడా ఛాన్సెస్ వస్తాయని నిరూపించడం తన మొదటి కర్తవ్యమని అనేక ఇంటర్వూస్ లో చెప్పుకొచ్చింది. అనుకున్నదే తడవుగా తన ఆలోచనను ఇంప్లిమెంట్ చేసేస్తోంది కూడా.

బుల్లితెరలో వచ్చిన అవకాశాన్ని కూడా సద్వినియోగపరచుకుంది. డాన్స్ షోకు జడ్జ్ గా వ్యవహరిస్తోంది. జడ్జ్మెంట్ ను వీర లెవెల్లో ఇచ్చిపడేస్తోంది. అలాగే, బెల్లంకొండ సినిమాలో ఐటెం సాంగ్ లో దుమ్మురేపింది. సినిమాకి టాక్ ఎలా వచ్చినా మోనాల్ ఐటెం సాంగ్ కి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగపరచుకుంటానని సందర్భం వచ్చినప్పుడల్లా చెప్పుకొస్తోంది.

ఇదిలా ఉంటే, రీసెంట్ గా ఒకానొక సందర్భంలో తన ఎలిమినేషన్ కి గల కారణాన్ని వివరించింది. మెహబూబ్ ఎలిమినేషన్ సందర్భంగా అభిజిత్ ను హోస్ట్ నాగార్జున 'ఈ వారం మెహబూబ్ ప్లేస్ లో ఎవరుంటారని ఎక్స్పెక్ట్ చేశావు' అని ప్రశ్నించాడు. అప్పుడు అభిజిత్ ఏ మాత్రం తడుముకోకుండా 'మోనాల్' అని సమాధానం చెప్పాడు. అభిజిత్ ఇలా సమాధానం చెప్పడం వల్ల తన ఎలిమినేషన్ జరిగి ఉండవచ్చని. ఆడియెన్స్ కు ఈ విధంగా అభిజిత్ ఫీడ్ చేశాడని తన అనాలిసిస్ ను చెప్పుకొచ్చింది గుజరాతీ భామ. మొత్తమ్మీద, టాప్ 5లో ఉండకపోయినా అంతకు మించి బంపర్ ఆఫర్స్ ను పొందడంలో ముందుంటోంది ఈ ముద్దుగుమ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: