'డాన్ శీను' చిత్రంతో టాలీవుడ్ కు డైరెక్టర్ గా పరిచయమయ్యాడు గోపీచంద్ మలినేని. ఈ సినిమా 2010లో విడుదలైంది. రవితేజా అలాగే శ్రీయ ఇందులో హీరో హీరోయిన్స్ గా నటించారు. యాక్షన్ కామెడీ మూవీగా ఈ సినిమా తెరకెక్కింది. సూపర్ హిట్ టాక్ ను పొందింది.

2012లో 'బాడీగార్డ్' మూవీ విడుదలైంది. ఈ సినిమాలో వెంకటేష్ అలాగే త్రిష లీడ్ రోల్స్ పోషించారు. ఆ తరువాత 2013లో మళ్ళీ రవితేజాతోనే వర్క్ చేశాడు. "బలుపు" అనే చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. రవితేజా అలాగే శృతి హాసన్ ఇందులో లీడ్ రోల్స్ పోషించారు. ఈ సినిమాలోని వీళ్ళిద్దరితో పనిచేయడం గోపీచంద్ కు కంఫర్ట్ అనిపించింది. కాబట్టి, ఇదే కాంబినేషన్ ను మళ్ళీ "క్రాక్"లో రిపీట్ చేశాడు.  డైరెక్టర్ గా పరిచయం కాకముందు ఈ యువదర్శకుడు ఎన్నో సినిమాలకు  వర్క్ చేశాడు.తగినంత ఎక్స్పీరియన్స్ ను సొంతం చేసుకున్నాడు.

ఐతే, 'క్రాక్' ను డైరెక్ట్ చేయడానికి ముందు సాయి ధరమ్ తేజ్ అలాగే రామ్ ను కూడా డైరెక్ట్ చేశాడు. "విన్నర్" అలాగే "పండుగ చేసుకో" సినిమాలను డైరెక్ట్ చేశాడు. రీసెంట్ గా విడుదలైన "క్రాక్" సినిమా గోపీచంద్ మలినేని కెరీర్ కే బ్రేక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. రవితేజాతో హ్యాట్రిక్ కొట్టాడు ఈ యువదర్శకుడు. ఇందులో, ప్రతి పాత్రను దర్శకుడు  హైలైట్ చేసిన తీరు ఆడియెన్స్ ను ఫిదా చేసింది.


"క్రాక్" మూవీలో వెంకటేష్ వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది. "బాడీ గార్డ్" మూవీలో ఆల్రెడీ వెంకటేష్ తో గోపీచంద్ వర్క్ చేశాడు. మళ్ళీ వెంకీతో గోపీచంద్ వర్క్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే, ఇంకొందరు యువహీరోలు కూడా గోపీచంద్ తో వర్క్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి,గోపీచంద్ కోసం స్టార్ హీరోస్ క్యూ కడుతున్నారన్న టాక్ ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతోంది.

అంతేకాదు, స్టార్ హీరోయిన్స్ కూడా క్యూ కడుతున్నారట. "జయమ్మ" క్యారెక్టర్ ను హైలైట్ చేసిన తీరుకు ఇంప్రెస్ ఐన హీరోయిన్స్ తమకు కూడా ఇంపార్టెంట్ రోల్ ఇవ్వమని గోపీచంద్ కు రిక్వెస్ట్ లు పంపుతున్నారట. నెగటివ్ రోల్ తో కూడా ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేయొచ్చని గోపీ నిరూపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: