సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కించిన యాక్షన్ కామెడీ మూవీ "అల్లుడు అదుర్స్". బెల్లంకొండ శ్రీనివాస్ ఇందులో హీరోగా నటించలేదు.  ఇద్దరు హీరోయిన్స్ బెల్లంకొండపై జోడీగా కనిపించారు. అను ఇమ్మాన్యుయేల్ అలాగే నభా నటేష్ ఇందులో తమ అందచందాలతో అలరించారు. ఈ సినిమా అనేది సంక్రాంతి సినిమాల రేసులో ఆటలో అరటిపండుగా మిగిలిందన్న టాక్ నడుస్తోంది. అందుకు కారణాలు అనేకం అనంటున్నారు విశ్లేషకులు. అవేంటో, ఇప్పుడు తెలుసుకుందాం.

అవుట్ డేటెడ్ కామెడీ అనేది ప్రేక్షకులకు రుచించలేదని టాక్ నడుస్తోంది. దర్శకుడు "కందిరీగ" సినిమా ఫార్ములానే ఫాలో అయ్యాడని అంటున్నారు ఆడియెన్స్. సినిమాలో కామెడీ అనేది సింక్ అవలేదని విశ్లేషకుల అభిప్రాయం. నిజానికి కామెడీ మితిమీరిపోవడంతో స్టోరీ అనేది పక్కత్రోవ పట్టిందేమోనన్న టాక్ కూడా వినిపిస్తోంది. ప్రకాష్ రాజ్ అలాగే సోనూ సూద్ వంటి ప్రముఖ నటులు అసలీ సినిమా స్క్రిప్ట్ ను చదివారా అన్న సందేహం కూడా కలుగుతోంది.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ క్యారక్టరైజేషన్ ను కన్ఫ్యూజన్ గా తీర్చిదిద్దారేమో అన్న కన్ఫ్యూజన్ కూడా కలుగుతోంది. సాయి శ్రీనివాస్ పాత్రను తీర్చిదిద్దిన తీరును చూసి ఆడియెన్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారట. రాబోయే సన్నివేశాలను ప్రేక్షకులు ఈజీగానే గెస్ చేసేస్తున్నారు. తరువాత ఏం జరుగుతుంది అన్న సస్పెన్స్ ను మెయింటెయిన్ చేయలేకపోయాడు దర్శకుడు.

ఐతే, లాజిక్స్ గురించి ఆలోచించకుండా కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం ఆలోచిస్తే ఈ సినిమా మంచి కాలక్షేపాన్ని అందిస్తుంది. సంక్రాంతి సందర్భంగా విడుదలైన మిగతా సినిమాలతో పోల్చితే ఈ సినిమా అనేది రేసులో కొంచెం వెనుకబడే ఉంది. అందుకే, బెల్లంకొండ 'ఆట'లో అరటిపండు అయ్యాడన్న టాక్ ఫిలిం నగర్లో వినిపిస్తోంది.

బెల్లంకొండ ఫైట్లు అలాగే డ్యాన్సులు బాగానే చేస్తాడు.కథల సెలెక్షన్లో కూడా కొంచెం శ్రద్ధ వహిస్తే మంచి హిట్ కొట్టే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం, బెల్లంకొండ బాలీవుడ్ పై దృష్టిపెట్టాడు. "ఛత్రపతి" హిందీ రీమేక్ లో నటిస్తున్నాడు. ఈ సినిమాని వీవీ వినాయక్ డైరెక్ట్ చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: