ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాలు దాదాపు అన్నీ హిట్ అనే చెప్పాలి.. కరోనా కారణంగా మూతబడ్డ సినిమా థియేటర్లు ఓపెన్ అయ్యాక వచ్చిన సినిమాలు కావడంతో టాక్ తో సంబంధం లేకుండా ఆకలిగా సినిమాలను చూసేస్తున్నారు ప్రేక్షకులు.. రవితేజ క్రాక్ సంక్రాంతి రేస్ లో ముందుగా రిలీజ్ కాగా, ఆ తర్వాత మాస్టర్, రెడ్, అల్లుడు అదుర్స్ సినిమాలు వరుసగా రిలీజ్ అయ్యి మంచి ఓపెనింగ్స్ ని రాబట్టుకున్నాయి.. అయితే వీటిలో చాల తక్కువగా ఓపెనింగ్స్ రాబట్టుకున్న సినిమా మాస్టర్..

తమిళ హీరో విజయ్ దళపతి హీరోగా చేసిన ఈ సినిమా కరోనా రావడానికి ముందే రిలీజ్ కి రెడీ గా ఉన్నా ధియేటర్లు ఓపెన్ కాకపోవడంతో సినిమా రిలీజ్ ని ఆపేశారు.. దాంతో చాలా రోజులు వెయిట్ చేసి మరీ దియేటర్లలో సినిమా ను రిలీజ్ చేశాడు. అయితే తమిళంలో బాగానే ఉన్నా తెలుగులో నెగెటివ్ టాక్ తెచ్చుకుంది.  తెలుగు లో  నెగెటివ్ టాక్ తెచ్చుకోవడానికి కారణం హీరో తమిళ హీరో అవడం ఒకటైతే సినిమా కూడా అంతగా లేదన్నది మరొక కారణం.. అయితే ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా ఈ సినిమా కి డిమాండ్ తగ్గట్లేదట.. బాలీవుడ్ లో ఈ సినిమా రీమేక్ చేయబోతున్నారని తెలుస్తుంది.

ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ధృవీకరించడంతో ఫ్లాప్ సినిమా కి రీమేకా అంటూ విజయ్ ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు.హీరో గా ఎవరు నటిస్తారన్నది మాత్రం వెల్లడించలేదు. అయితే ఈ సినిమా హిందీ లో కూడా రిలీజ్ అయ్యింది.  యుట్యూబ్ లో ఫ్రీగా చూసి వందల మిలియన్ల వ్యూస్ ని కుమ్మరించే నార్త్ ఆడియన్స్ దీన్ని థియేటర్లో చూసేందుకు అంతగా ఇష్టపడటం లేదు. అందుకే అక్కడ వసూళ్లు మందకొడిగా ఉన్నాయి. అందులోనూ పాజిటివ్ టాక్ రాకపోవడం కూడా ప్రభావం చూపిస్తోంది. ఇన్ని ప్రతికూలాంశాలు ఉన్నా కూడా ఈ సినిమా హిందీ లో రీమేక్ అవడం అంటే ఆశ్చర్యపోవాల్సిన విషయమే.. సినీ 1 స్టూడియోస్ అధినేత మురాద్ ఖేతాని దీన్ని నిర్మించబోతున్నారు. డైరెక్టర్, మిగితా వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు..

మరింత సమాచారం తెలుసుకోండి: