పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడేళ్ళ తరువాత రీ ఎంట్రీ ఇస్తున్నాడు. రీ ఎంట్రీలో మొదటి మూవీగా 'వకీల్ సాబ్' ని పేర్కొనవచ్చు. ఇది బాలీవుడ్ లో హిట్టైన "పింక్"కు తెలుగు రీమేక్. ఈ మూవీ షూటింగ్ కంప్లీటయింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. ఈ సినిమా ఏప్రిల్ లో విడుదలయ్యే సూచనలున్నాయి.

ఇప్పటికే , ఈ టీజర్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇందులో పవన్ చెప్పిన 'కోర్టులో వాదించడం తెలుసు, కోటు తీసి కొట్టడమూ తెలుసు' అనే డైలాగ్ హైలైట్ గా నిలిచింది. ఈ సినిమాను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ట్రైలర్ చూసాక ఆడియెన్స్ ఇది వకీల్ సాబ్ మూవీనా లేక మాస్టర్ మూవీ సీక్వలా అని కన్ఫ్యూజయిన మాట కూడా నిజమే.

ఇదిలా ఉంటే, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్రిష్ డైరెక్షన్ లో నటిస్తున్నాడు. అలాగే మలయాళంలో సూపర్ హిట్టైన "అయ్యప్పనుమ్ కోషియమ్" తెలుగు రీమేక్ లో కూడా నటిస్తున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభమవుతుంది.  

అలాగే, పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ డైరెక్షన్ లో కూడా నటించబోతున్నాడు. సురేందర్ రెడ్డికి కూడా అవకాశం ఇచ్చే ఆలోచనలో ఉన్నాడు. డాలీతో కూడా ప్రాజెక్ట్ కన్ఫర్మ్ చేసే ఆలోచనలో ఉన్నాడు.

ఇలా అరడజను మూవీస్ పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్నాయి. ఒక్కొక్క మూవీకి పవన్ కళ్యాణ్ దాదాపు ఏభై నుంచి ఏభై ఐదు కోట్లు డిమాండ్ చేస్తున్నాడని టాక్. అంటే, పవన్ దాదాపు 300 నుంచి 350 కోట్ల పారితోషికాన్ని అందుకుంటున్నట్టు ఫిలిం నగర్ గుసగుసలు. ఇది నిజంగా భారీ డీల్ అనంటున్నారు విశ్లేషకులు.

ఏదిఏమైనా, పవన్ రీ ఎంట్రీ విషయం మాత్రం అభిమానులకు పండుగ వాతావరణాన్ని తెచ్చిపెడుతోంది. ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ ని వెండితెరపై చూద్దామా అని ఆడియెన్స్ వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: