మంచి అవకాశం రాగానే ఆ తర్వాత స్టార్లు అయిపోవచ్చని చాలా మంది యువ హీరోయిన్లు అనుకుంటారు. కానీ ఒక్కోసారి అది జరగదు. సినిమాలో మంచి ట్యాలెంట్ చూపించినా అవకాశాలు మాత్రం అరకొరగానే వస్తాయి. కొంత మంది హీరోయిన్లు చాలా కష్టపడి సినిమా పరిశ్రమకు వచ్చి సినిమా అవకాశాలు దక్కించుకుంటారు. కానీ ఒకటి రెండు చిత్రాలలో నటించగా అవి కాస్తా ఫ్లాప్ అయ్యాయంటే ఇక అంతే. ఇలా సినిమా పరిశ్రమలో తెరమరుగైన హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. ఇందులో ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో ఓ రేంజ్ పాపులర్ అయిన హీరో ప్రభాస్ సరసన నటించిన ఓ హీరోయిన్ కూడా ఉంది. ప్రముఖ దర్శకుడు సురేష్ కృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన “రాఘవేంద్ర” అనే చిత్రం తెలుసు కదా. ఈ సినిమాలో రెండో హీరోయిన్ గా నటించిన శ్వేత అగర్వాల్ అనే అమ్మాయి అసలు గుర్తుందా?

అయితే రాఘవేంద్ర చిత్రంలో టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించగా ప్రముఖ సీనియర్ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీత స్వరాలను సమకూర్చారు. అయితే ఈ చిత్రంలో హీరోగా నటించిన ప్రభాస్ ప్రస్తుతం సౌత్ ఇండియాతో పాటు నార్త్ ఇండియాలో కూడా టాప్ హీరోల్లో ఒకడిగా మారిపోయాడు. మరి కొన్ని రోజుల్లో బాలీవుడ్‌లో ప్రభాస్ బిజీ స్టార్ అయిపోయినా ఆశ్చర్యం లేదు.

కానీ రాఘవేంద్ర చిత్రంలో రెండో హీరోయిన్ గా నటించిన శ్వేత అగర్వాల్ మాత్రం ఉన్నట్లుండి తెరమరుగైంది. శ్వేత అగర్వాల్ రాఘవేంద్ర చిత్రంలో నటించిన ఐదు సంవత్సరాల వరకూ మరో సినిమా చేయలేదు. ఈ భారీ గ్యాప్ అనంతరం ఇంగ్లీషులో “తందూరి లవ్” అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది. కానీ ఈ చిత్రం కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో ఆమెకు మళ్లీ అవకాశాల కొరత ఏర్పడింది. ఇక చివరగా బాలీవుడ్లో ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ దర్శకత్వం వహించిన “షాపిత్” అనే హార్రర్ చిత్రంలో మెయిన్ లీడ్ పాత్రలో నటించింది. ఈ చిత్రం పర్వాలేదు అనిపింకుంది. కానీ అదే సమయంలో శ్వేత అగర్వాల్ వ్యక్తిగత కారణాల వల్ల సినిమా పరిశ్రమను వదిలిపెట్టాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఆమె మళ్లీ ఎవరికీ కనబడలేదు. ప్రస్తుతం శ్వేతా అగర్వాల్ ఏం చేస్తుంది.? ఎక్కడ ఉందనే విషయాల గురించి ఎలాంటి సమాచారం కూడా లేకపోవడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: