మెగా కుటుంబం నుండి అరడజన్ కు పైగా హీరోలు ఇండస్ట్రీ లో వెలుగొందుతున్న సంగతి తెలిసిందే. అయితే వీరిలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాత్రం కాస్త డిఫరెంట్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్ వరుస హిట్స్ తో తన క్రేజ్ ను మరింత పెంచుకుంటున్నాడు. ఈ మెగా హీరో ప్రస్తుతం బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కే ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తో పాటుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎఫ్3 సినిమాను కూడా ఈ మద్యనే పట్టాలెక్కించాడు.

ఇదిలా ఉండగా వరుణ్ తేజ్ తాజా చిత్రం యొక్క ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్ . వరుణ్ తేజ్ పదవ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ నెల 19 వ తేదీ ఉదయం 10గంటల 10నిముషాలకు విడుదల చెయ్యనున్నట్టు ఆ ప్రీ లుక్ పోస్టర్ లో తెలిపింది చిత్రయూనిట్.

అయితే ప్రస్తుతం ఈ పోస్టర్  అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బాక్సింగ్ చేసేందుకు సిద్దమవుతున్నట్లు చేతులకు క్లాత్ కట్టుకుంటూ ఉన్న ఈ పోస్టర్‌ చూస్తే మరొక బ్లాక్ బస్టర్ సినిమా గుర్తు రాక మానదు. అదే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన "తమ్ముడు " సినిమా. ఇందులో కూడా పవన్ చేతులకు క్లాత్ కట్టుకొని బాక్సింగ్ ట్రైనింగ్ చేస్తూ కనిపిస్తాడు. వరుణ్ తేజ్ ప్రీ లుక్ చూసిన అభిమానులు ఇదే ప్రస్తావిస్తూ బాబాయి సినిమా మాదిరి ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమా తో మెగా ప్రిన్స్ ఎలాంటి విజయం అందుకుంటాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: