ఎన్నో ఏళ్ల నుంచి బుల్లితెరపై టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ ప్రస్తుతం ఎంతో మందికి ఫేవరెట్ షో  గా  మారిపోయిన కామెడీ షో ఏదైనా ఉంది అంటే అందరూ టక్కున  చెప్పే పేరు జబర్దస్త్.  ప్రస్తుతం నవ్వులకు కేరాఫ్ అడ్రస్ గా  ఆనందానికి చిరునామాగా మారిపోయింది జబర్దస్త్ షో. ఇక జబర్దస్త్ షో ఎంతో విజయవంతంగా కొనసాగుతున్న తరుణంలోనే బుల్లితెర ప్రేక్షకులందరికీ మరింత ఎంటర్టైన్మెంట్ పంచాలి అనే ఉద్దేశంతో.. ఎక్స్ ట్రా జబర్దస్త్ అనే షో కూడా ప్రారంభించారు అనే విషయం తెలిసిందే. జబర్దస్త్ ఎంతో మంది కమెడియన్స్ కి లైఫ్ ఇచ్చింది.



 ఇదిలా ఉంటే జబర్దస్త్ లో ఎప్పుడు ఏదో ఒక జంట హాట్ టాపిక్ గా  మారిపోవడమే కాదు ఎంతో క్రేజ్ సంపాదిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే . ఈ క్రమంలోనే జబర్దస్త్ షో ప్రారంభం అయినప్పటి నుంచి సుడిగాలి సుదీర్.. యాంకర్ రష్మి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఈ జంట జబర్దస్త్ షో లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక ఈ జంట ఎక్కడ కనిపించినా కూడా బుల్లితెర ప్రేక్షకులు అందరూ ఎంతగానో మురిసిపోయేవారు. అంతేకాదు ఈ టీవీ వారు నిర్వహించే ప్రతి ఈవెంట్ లో కూడా ఈ జంట సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారిపోయేది. ఇక ఈ మధ్య కాలంలో జబర్దస్త్ లో  వర్ష ఇమ్మానియేల్ జంట ఎంతగానో క్రేజ్  సంపాదించింది అన్న విషయం తెలిసిందే.


 జబర్దస్త్ జడ్జి రోజా వీరి జంటను బ్లాక్ అండ్ వైట్ జంట అని చెప్పడం.. ఇద్దరు రొమాంటిక్ డైలాగ్స్ చెప్పుకోవడం కూడా ఈ జంటను మరింత ఫేమస్ చేసింది. ప్రస్తుతం ఈ టీవీ లో ఎక్కడ చూసిన ఈ బ్లాక్ అండ్ వైట్ జంట  దర్శనమిస్తుంది. అయితే ఇటీవలే జబర్దస్త్ కు  సంబంధించి విడుదలైన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే ప్రోమో లో భాగంగా కెవ్వు కార్తిక్ స్కిట్  వస్తున్న సమయంలో.. వర్ష తండ్రి పాత్రలో ఇమ్మానియేల్ నటిస్తాడు. ఈ క్రమంలో నాన్న నాన్న అంటూ పదే పదే వర్ష  ఇమ్మానియేల్ ను  విసిగిస్తుంది. అదే టైంలో నాన్న పాత్రలో ఉన్న ఇమ్మానియేల్ వచ్చిందే అవకాశంగా అందరిముందు వర్షకు ముద్దు పెడతాడు. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: