టాలీవుడ్‌లో ప్రస్తుతం ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో హీరో రామ్ ఒకడు. గతేడాది లాక్ డౌన్ నిబంధనలు అమలైన సమయంలో చాలామంది సెలబ్రిటీల పెళ్లిళ్లు జరిగిపోయాయి. దీంతో పెళ్లి కాని హీరో హీరోయిన్లను ఎవరు ఇంటర్వ్యూ చేసినా.. పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా ఎదురవుతున్నాయి.

ప్రస్తుతం హీరో రామ్ వయస్సు 32 సంఫత్సరాలు. తాజాగా విడుదలైన ఆయన రెడ్ సినిమా కోసం ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. ఈ సమయంలో రామ్‌ను కూడా చాలా మంది పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు బాగా అడుగుతున్నారు. అయితే రామ్ మాత్రం ఇతర హీరో హీరోయిన్లు చెప్పే మాటలకు భిన్నంగా “పెళ్లి మన చేతిలో ఉండదు. పెళ్లి తర్వాత ఏదీ మన చేతిలో ఉండదు” అంటూ చమత్కారంగా సమాధానం ఇస్తున్నాడు. సమయం వచ్చినప్పుడు పెళ్లి అదే జరిగి పోతుందని చెప్పేశారు. అయితే రామ్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారనే ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకలేదు. 2019లో ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో సక్సెస్ అందుకున్న రామ్.. ఈ ఏడాది రెడ్ సినిమాతో మరో మంచి సక్సెస్ ఖాతాలో వేసుకున్నాడు.

ఇస్మార్ట్ శంకర్ సినిమాకు వచ్చినట్లే ‘రెడ్’ సినిమాకు కూడా పూర్తి స్థాయిలో పాజిటివ్ టాక్ రాలేదు. అయితే టాక్ పాజిటివ్ గా లేకపోయినా కలెక్షన్ల విషయంలో మాత్రం రామ్ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. రామ్ రెడ్ సినిమాకు తొలిరోజే ఏకంగా 6.7 కోట్ల రూపాయల షేర్ దక్కింది. బాక్సాఫీస్ దగ్గర క్రాక్ మినహా మిగతా సినిమాలేవీ పోటీ ఇవ్వకపోవడం కూడా రెడ్ చిత్రానికి కలిసొచ్చింది. దీంతొ రెడ్ మూవీకి కలెక్షన్లు బాగా వస్తున్నాయి.

ఈ క్రమంలో మరో ఇంటర్య్వూలో కూడా రామ్‌ను పెళ్లి గురించి ప్రశ్నించారు. ‘మీ సీతను ఎప్పుడు పరిచయం చేస్తారు?’ అని ప్రశ్నించగా.. ‘నాకు పరిచయం అయిన వెంటనే చేస్తానని’ రామ్ బదులిచ్చారు. వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లు అందుకుంటున్న రామ్ భవిష్యత్తులో స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో కూడా నటిస్తాడని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందని వార్తలు వస్తన్నాయి. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు ఇంకా పూర్తిగా బయటకు రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: